అన్వేషించండి

Chandrababu: ప్రకాశం బ్యారేజీ గేట్లు పరిశీలించిన చంద్రబాబు, కన్నయ్య నాయుడును నివేదిక కోరిన సీఎం

Prakasam Barrage : సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల్లో నిపుణుడు కన్నయ్యనాయుడుతో మాట్లాడారు. ఆయన మార్గదర్శకత్వంలో గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.

AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వరదల కారణంగా కొన్నిబోట్లు కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న సంగతి తెలిసిందే. దీంతో 67, 69 గేట్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో చెడిపోయిన గేట్లకు కొత్త కౌంటర్ వెయిట్ లను అమర్చారు. మిగిలిన మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. నదిలో లక్షన్నరకు పైగా క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి సిబ్బంది గేట్లను అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో విజయవంతంగా గేట్ల మరమ్మతులు పూర్తి అయ్యాయి.


కన్నయ్యతో మాట్లాడిన చంద్రబాబు
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ వద్దకు వచ్చి ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల్లో నిపుణుడు కన్నయ్యనాయుడుతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న బోట్లను తొలగించారు. ఆధునాతన విధానంలో కౌంటర్ వెయిట్లను బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ తయారు చేసింది. భవిష్యతులో భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కోటి 17 టన్నుల చొప్పున బరువున్న కౌంటర్ వెయిట్లను భారీ క్రేన్ల సహాయంతో రెండు గేట్ల వద్ద ఏర్పాటు చేశారు. రికార్డు సమయంలో కీలక పనులను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు వచ్చి గేట్ల మరమ్మతులు, పడవల తొలగింపు ప్రక్రియను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి పర్యవేక్షించారు.  

సెప్టెంబర్ 1న బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు
సెప్టెంబర్ 1న ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వేగంగా వచ్చిన  మూడు బోట్లు గేట్లకు బలంగా ఢీకొనడంతో 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. వీటిలో 67, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు పనికిరాని విధంగా ధ్వంసం అయ్యాయి.గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత 69 గేట్ వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియ  చేపట్టారు. భారీ కట్టర్లు, క్రేన్లతో దెబ్బతిన్న దానిని రెండుగా చేశారు. ఒక్కొక్కటి 17 టన్నుల బరువున్న వీటిని భారీ క్రేన్ల సహాయంతో ప్రకాశం బ్యారేజీ నుంచి బయటకు తరలించారు. అనంతరం గేటును కిందకు దించి ప్రవాహాన్ని నిలిపివేశారు.


బెజవాడను వీడని వాన
బెజవాడను వర్షం వీడడం లేదు. శనివారం కూడా కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు కృష్ణ బేసిన్ లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్‌నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం  గ్రామాల్లో ఒక అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget