Chandrababu Delhi Tour: ఢిల్లీలో 2 రోజులపాటు బిజీబిజీగా చంద్రబాబు, ఏపీ సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్
Andhra Pradesh CM Chandrababu Delhi Tour | ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ సీఎంతో భేటీ కానున్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల(15,16 తేదీలు) పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల అంశంపై చర్చించేందుకు చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జల్ శక్తి మంత్రి అధ్యక్షతన సమావేశం కానున్నారు. గోదావరి, కృష్ణా జలాల నీటి వాటాలు, పంపకాలపై.. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు అవకాశం ఉంది. జులై 17న ఉదయం చంద్రబాబు ఏపీకి బయలుదేరతారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూల్..
- ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 11.45కు ఢిల్లీ చేరుకుంటారు
- మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు.
- మధ్యాహ్నం 2.30 గంటలకు 1-జన్‌పథ్‌లో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సరస్వత్‌తో సమావేశం కానున్నారు.
- మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ అవుతారు. ముఖ్యమంత్రి నివాసం 1-జన్‌పథ్‌లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చిస్తారు.
- మధ్యాహ్నం 3.30 గంటలకు మూర్తి మార్గ్-3లో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సంస్మరణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
- రాత్రి 7 గంటలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశం అవుతారు.
- 16వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుక్ ఎల్ మాండవీయతో చంద్రబాబు భేటీ అవుతారు.
- అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు జలశక్తి భవన్‌లో కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం అవుతారు.
- సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.
- 16వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేసి 17 వ తేదీ గురువారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.






















