అన్వేషించండి

AP BJP : జనసేనతోనే ఉన్నాం - పొత్తులపై ఢిల్లీలో నిర్ణయం - ఏపీ బీజేపీ ప్రకటన !

జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఏపీ బీజేపీ చెబుతోంది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలా లేదా అన్నది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని ప్రకటించింది.

 

AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసి వెళ్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం సంచలనం అయింది. ఇప్పటి వరకూ బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. సాంకేతికంగా ఆ రెండు పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి కానీ ఇంత వరకూ ఎక్కడా కలిసి పని చేయలేదు. పోరాటాలు చేయలేదు. ఇప్పటికే తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని బీజేపీ చెబుతోంది. పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత బీజేపీ మీడియా విభాగం పొత్తులపై తమ అభిప్రాయాన్ని విడుదల చేసింది. జనసేనతోనే పొత్తులో ఉన్నామని.. పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. 
 
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని  పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారని.. కానీ  పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు.  ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందిని ఏపీ బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది.  ప్రధాని మోదీ,  బిజెపి జాతీయ అధ్యక్షులు  జేపీ నడ్డా అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు.  ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగుతోందని తెలిపింది.  అయితే ఏపీలో బీజేపీ వైసీపీకి దగ్గరగా ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. కానీ తాము వైఎస్ఆర్‌సీపీకి దగ్గరా లేమని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. సోము వీర్రాజును మార్చి పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ సర్కార్‌పై విమర్శలు పెంచారు.                                    

తెలుగుదేశంతో పొత్తులపై ఢిల్లీలో స్థాయిలో చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు ఓ సారి ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా, అమిత్ షాలతో చర్చలు జరిపారు. అయితే ఆ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదని.. ఇప్పటికే ఆలస్యమయిందని చంద్రబాబు.. ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు మీడియా ప్రతినిధులతో చెప్పారు.  ఏపీలో పొత్తులపై కాలనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామి. అందుకే.. మళ్లీ ఎన్డీఏలో చేరుతుందని జాతీయ మీడియాలో గతంలో ప్రచారం జరిగింది.                                     

కానీ ఇటీవలి కాలంలో ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులతో పవన్ కల్యాణ్ ఒక్క సారిగా తన మనసు మార్చుకున్నారు.  చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పొత్తును ప్రకటించేశారు. బీజేపీ కలిసి వస్తే సరి లేదంటే లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఏపీలో బీజేపీ పరిస్థితి ఒంటరి అయినట్లు అయింది.                                                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
తిరుమల లడ్డూ వివాదంపై పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, CBIకి చెప్పాలని సూచన
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Madhavi Latha Iftar Flexis: MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
Embed widget