అన్వేషించండి

Vijayawada News: విజయవాడ బస్సు ప్రమాదం సీసీ ఫుటేజీ విడుదల - ఘోర విషాదానికి కారణం ఏంటి?

Andhrapradesh News: విజయవాడలో సోమవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీ ఫుటేజీని అధికారులు విడుదల చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Vijayawada Bus accident: విజయవాడలో సోమవారం ఘోర బస్సు ప్రమాద దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నెహ్రూ బస్టాండులో ఏసీ బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకురాగా, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులుగా ఫస్ట్ గేర్ వేయడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎక్సలేటర్ పట్టేయడం వల్లే రివర్స్ గేర్ వేశానని అయినా ఫలితం లేకపోయిందని బస్సు డ్రైవర్ తెలిపారు. అయితే, తాజాగా ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు విడుదల చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. 

విజయవాడ బస్సు ప్రమాదం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. బస్సులన్నీ కండిషన్ లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నా, ప్రమాదాల నేపథ్యంలో బస్సుల ఫిట్ నెస్ పై విమర్శలు వస్తున్నాయి. కాగా, సోమవారం ప్రమాదానికి గురైన బస్సు ట్రాన్స్ మిషన్ విధానంలో నడుస్తుంది. విజయవాడ ఆటోనగర్ డిపోలో ఇలాంటివి 13 బస్సులున్నా, తరచూ పాడవుతున్న కారణంగా ఆరింటినే నడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రైవర్లకు బెంగుళూరులోని వోల్వో కంపెనీ కేంద్రానికి పంపి శిక్షణ ఇప్పించేవారు. కొంతకాలంగా డ్రైవర్లకు డిపోకి చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఆఫీసర్ తోనే శిక్షణ ఇప్పిస్తున్నారు.

ఎక్సలేటర్ సమస్య

ప్రమాదానికి గురైన బస్సులో కొంతకాలంగా ఎక్సలేటర్ సెన్సార్ సమస్య ఉందని సమాచారం. ఎక్సలేటర్ తొక్కినప్పుడు, కాలు లేపినప్పుడు దాని కింద రోలర్ ముందుకు, వెనక్కు కదులుతుంది. ఇది సెన్సార్ కు అనసుంధానమై ఉంటుంది. కొంతకాలంగా సెన్సార్ స్ట్రక్ అవుతోందని, పెడల్ తొక్కి, దానిపై కాలు తీస్తే వెంటనే పైకి రాకుండా అలాగే ఉండిపోతుందని డ్రైవర్లు గుర్తించారు. దీని వల్ల బస్సు ఒక్కసారిగా ముందుకు మజంప్ అవుతోందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ సైతం ఇదే విషయం తెలిపారు. వారం కింద ఈ బస్సు నడిపిన ఓ డ్రైవర్, ఆదివారం మరో డ్రైవర్ సైతం రిపేర్ ఎట్ గ్యారేజ్ షీట్ లో ఎక్సలేటర్ సమస్యను సరి చేయాలని రాసినట్లు తెలుస్తోంది. 

పెడల్ వద్ద ప్లాస్టిక్ కవర్

ప్రమాదానికి గురైన బస్సులో ఎక్సలేటర్ పెడల్ కు ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉండడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెడల్ కిందకు తొక్కినప్పుడు అది రోలర్ వద్ద ఇరుక్కుపోకుండా పైకి వచ్చేలా లాక్ పిన్ ఉంటుందని, అది వేయకపోవడంతోనే చాలా కాలంగా డ్రైవర్లే ఇలా ప్లాస్టిక్ కవర్ చుట్టినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు మాత్రం పెడల్ పై డ్రైవర్ కాలి గ్రిప్ కోసం అలా ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. ఎక్సలేటర్ పెడల్ వద్ద ఉండే సెన్సార్ తడిచిపోకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ చుట్టినట్లు మెకానిక్స్ చెబుతున్నారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సు 10 లక్షల 65 వేల కి.మీ తిరిగిందని, ఇది తరచూ మరమ్మతులకు గురవడం, మార్గమధ్యలో ఆగిపోవడం జరుగుతూనే ఉందని తెలుస్తోంది. 

సిక్ లీవ్ తర్వాత విధులకు

మరోవైపు, ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ ఇటీవల్ బైక్ ప్రమాదంలో గాయపడి సిక్ లీవ్ తీసుకుని, ఆ తర్వాత విధులకు హాజరవుతున్నారు. వాస్తవానికి ఆయనకు సోమవారం వారాంతపు సెలవు కాగా, లీవ్స్ సర్దుబాటు క్రమంలో సోమవారం సెలవైనా విధులు నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు, ఈ ప్రమాదంలో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.

Also Read: Yatra 2 : 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఇటలీ నుంచి కాదు, జర్మన్ నటి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Embed widget