Breaking News Live: 4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
‘‘అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా అనంతపురం జిల్లా మడకశిరలో 12.2 డిగ్రీలు నమోదయ్యింది. కర్ణాటక కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వైపున పొగ మంచు తిరుపతి, చిత్తూరు జిల్లా తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లా దక్షిణ భాగాల్లోకి విస్తరిస్తోంది. గోదావరి జిల్లా భీమవరం పరిశరాల్లో కూడ పొగ మంచు విస్తరిస్తోంది. నగరాల వారీగా కర్నూలులో అత్యల్పంగా 15.3 డిగ్రీలు నమోదయ్యింది. చలి తీవ్రత గత వారంతో పోలిస్తే తక్కువగానే ఉంది. మళ్లీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎండ, కాస్త వేడిగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వెండి ధర గ్రాముకు రూ.0.50 పైసలు తగ్గి కిలోకు రూ.500 దిగి వచ్చింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,100గా నిలకడగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.
4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 4వ తరగతి విద్యార్ధిని పై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఛత్రినక పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగమ్మెట్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల 4వ తరగతి అమ్మాయిపై ఉపాధ్యాయుడు అశ్వక్( 35) లైంగిక దాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అశ్వక్( 35) ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఏపీలో ఎస్మా ప్రయోగం.. ముందుగా మైనింగ్ శాఖలో ఉత్తర్వులు జారీ
ఉద్యోగులు సమ్మెకు వెళుతున్న క్రమంలో ఏపీలో ఎస్మా ప్రయోగిస్తున్నారు. ఈ మేరకు ముందుగా మైనింగ్ శాఖలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎస్మా అంటే ?
ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటేనెన్స్ యాక్ట్ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు. సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల ని ర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం ఈ చట్టం రూపొందించారు. 1981లో దీన్ని రూపొందించి చట్ట రూపమిచ్చారు.





















