Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్ నిలిచింది. 52 కేజీల విభాగం ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్‌పై తెలుగమ్మాయి నిఖత్ జరీన్ విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

Telangana Politics: కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్

ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన అధికార టిఆర్ఎస్ కు చెందిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మరియు పలువురు ముఖ్య నాయకులు.. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, మాజీ విప్ ఈరవర్తి అనిల్, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ యాదవ్. కాంగ్రెస్ నాయకులు ఫహీం తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి అవంతికి అడుగడుగునా ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత

విశాఖ... వైసీపీ గడప గడపలో ఎగిసిపడుతున్న ప్రజల నిరసన జ్వాలలు

మాజీ మంత్రి అవంతికి అడుగడుగునా ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత

ఆనందపురం మండలం సిర్లపాలెంలో ఆవంతికి గ్రామస్థుల నిరసన సెగ

ఎన్నికల ముందు గ్రామంలో రామాలయం కడతానని ఇచ్చిన హామీ సంగతేంటంటూ...

ఆవంతిని చుట్టుముట్టేసిన సిర్లపాలెం గ్రామస్తులు

సమాధానం చెప్పలేక జారుకున్న మాజీమంత్రి అవంతి

రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ ముఠా, మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు 

శ్రీకాకుళం నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా రెచ్చింది. సూర్యమహల్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తోన్న భోగి లక్ష్మణరావు సతీమణి మెడలో 10 తులాల గొలుసు దుండగులు లాక్కెళ్లారు. స్థానికులు వారిని పట్టుకోవడానకి ప్రయత్నం చేసినా దుండగులు చిక్కలేదు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

APRains : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న పెన్నా నది  

అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువున ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. హిందూపురం సమీపంలో పెన్నానది నిండుగా ప్రవహిస్తుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, విడపనకల్ మండలాలలో గత రెండు రోజుల నుంచి భారీగా వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉరవకొండ మండలంలోని బూడగవి, విడపనకల్ మండలంలోని ఉండబండ, డోనేకల్లు వంకలు మరువ పారుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

Background

బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా విస్తరిస్తున్నాయి. దీంతో రాగల రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal), అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ లో 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ(Kerala), కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల(Telugu States)కు ఈసారి ముందస్తుగా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం జిల్లాల్లోని చాలా చోట్ల రుతుపవనాల కారణంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల రెండు రోజుల్లో ఏపీ(Andhra Pradesh)లో ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. 

తెలంగాణలో 

తెలంగాణలో ఈ నెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్‌ నికోబార్‌ దీవులకు, అండమాన్‌ సముద్రంలో నైరుతి రుతుపవానలు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర- దక్షిణ ద్రోణి మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, మరట్వాడ, కర్నాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది. 

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు 

గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో 8.11 సెంటిమీట‌ర్ల వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లా దోమలో 5.08 సెం.మీ, నారాయణపేట జిల్లా కృష్ణలో 4.75 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 19 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41.9 డిగ్రీల సెంటిగ్రేడ్, జయశంకర్‌ భూపాల్‌పల్లి జిల్లా చిట్యాల 41.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ 41.4 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.