Perni Nani: చంద్రబాబు చేతిలో మరోసారి మోసపోవద్దు... విషయం తెలుసుకోకుండా ఎన్టీఆర్ కుంటుంబం విమర్శలు.. మంత్రి పేర్ని నాని కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు నమ్మి నిజం తెలుసుకోకుండా నందమూరి కుటుంబం వైసీపీపై నిందలు వేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయడం దురదృష్టకరమన్నారు.
శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనలపై నందమూరి ఫ్యామిలీ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందించారు. బాలకృష్ణ అమాయక చక్రవర్తి అని చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని నమ్ముతున్నారన్నారు. అందరి ఇళ్లల్లో మహిళలు ఉన్నారని, తాము అలా ఎందుకు తిడామన్నారు. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే మధ్యలో అనవసర చంద్రబాబు రాద్ధాంతం చేశారని ఆరోపించారు. చంద్రబాబు కావాలనే మెలో డ్రామా ఆడారని విమర్శించారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన శ్రీమతి ప్రస్తావనే తేలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
చంద్రబాబు మెలోడీ డ్రామా
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాలను పక్కకు పెట్టి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తీసుకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు ఏమన్నారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. అనని మాటలను, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి ఎవరూ మాట్లాడలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలనే చంద్రబాబు చూస్తున్నారన్నారు. బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు కూడా నిజంగానే అవి నమ్మారన్నారు. నందమూరి కుంటుంబంలో విషం ఎక్కించటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏదే జరిగనట్లు నమ్మించడానికి చంద్రబాబు నేర్పరితనం అన్నారు. అసెంబ్లీలో జగన్, ఆయన కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ టీడీపీ నేతలే మాట్లాడారని మంత్రి పేర్ని నాని తెలిపారు.
చంద్రబాబు చేతిలో మోసపోవద్దు
వివేకా హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉందన్న మంత్రి పేర్ని నాని.. ముద్దాయిలను అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో మైకు కట్ చేసినప్పుడు క్షణాల్లోనే సెల్ ఫోన్‌లో వీడియో ఎలా తీశారన్నారు. ఇదంతా ప్రీప్లాన్ గా చేసిన వ్యవహారమని విమర్శించారు. చంద్రబాబు చేతిలో ఇంకా మోసపోవద్దని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కోరుతున్నానన్నారు. ఏపీ రాజకీయాల్లో నిన్నటిరోజు నిజంగానే బ్లాక్ డే అని మంత్రి పేర్ని నాని అన్నారు.
Also Read: పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి