అన్వేషించండి

CM Jagan: పురపాలక, పట్టాణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా సీఎం సమీక్షించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... వర్షాకాలం ముగిసి పనుల సీజన్‌ మళ్లీ మొదలైనందున నగరాలు పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఒక స్పెషల్ డ్రైవ్‌ కింద రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శానిటేషన్‌ చేసి వినియోగించేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు. దీనివల్ల చాలావరకు తాగునీటిని ఆదా చేయగలుగుతామని అన్నారు.

ఈ సందర్భంగా విశాఖ నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. ఒక్క విశాఖ నగరంలోనే నాలుగేళ్లకాలంలో రూ.3,592 కోట్ల మేర రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, నీటి సరఫరా, వీధిలైట్లు, పార్కులు, సుందరీకరణ, మురుగునీటి శుద్ధి, వివిధ భవనాల నిర్మాణం, పౌరులకు సేవలకోసం ఖర్చుచేసినట్టు అధికారులు వెల్లడించారు. 

విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్‌ నిర్వహణమీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అన్నారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నూతన నిర్మించనున్న జీవీఎంసీ నూతన భవన నిర్మాణ పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రూ.100 కోట్లతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ భావన నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. రూ.300 కోట్లతో విశాఖ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనా ప్రాజెక్టు కింద త్వరలో పనులు ప్రారంభం అవుతున్నట్లు వెల్లడించారు. దీనికింద ముడసర్లోవ పార్క్‌ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో కమర్షియల్‌ కాంప్లెక్స్, మల్టీ లెవల్‌ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం, వీఎంఆర్డీఏ కింద నడుస్తున్న పలు పనుల ప్రగతినీ సీఎం జగన్ కు అధికారులు వివరించారు.

విజయవాడలో అభివృద్ధిపనుల పురోగతిని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అంబేద్కర్‌ స్మృతివనం పనులను, కన్వెన్షన్‌ సెంటర్‌ పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

విజయవాడలో కాల్వలు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం చెప్పారు. అత్యాధునిక యంత్రాలను దీనికోసం వినియోగించుకోవాలన్న కోరారు. విజయవాడ విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ పనులను కూడా పూర్తిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సీఎం ఆరా తీశారు. కంబాల చెరువు సహా వివిధ ప్రాంతాల్లో సుందరీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు చెప్పారు. రాజమండ్రి హేవ్‌లాక్‌ బ్రిడ్జి సుందరీకరణ సహా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సీఎం కోరారు. వరదల కారణంగా నెల్లూరు మునిగిపోయే పరిస్థితులు రాకుండా రక్షణ గోడ నిర్మాణం పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం అధికారులను ఆదేశించారు.

టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లను ఏర్పాటుచేసి వారిద్వారా నిర్వహణ చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలన్నారు.

" నగరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నాం. ప్లోటింగ్‌ సోలార్‌ ప్యానెల్స్, ఎస్‌టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం అత్యాధునిక యంత్రాలు తదితర వాటిని వివిధ ప్రాజెక్టుల కింద తీసుకువస్తున్నాం. వీటి నిర్వహణ అన్నది చాలా ముఖ్యం. లేకపోతే అవి మూలనపడతాయి. వాటి నిర్వహణకోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవవనరుల అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల్లో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకోసం అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టుల నిర్వహణకోసం ప్రత్యేక ఎస్‌ఓపీ కూడా ఉండాలి" అని సీఎం జగన్ అధికారులకు సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
RS Praveen: అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Embed widget