Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
Chandrababu Naidu ప్రధాని నరేంద్ర మోదీతో రేపు భేటీ కానున్నారు. ఉదయం 10.15 గంటలకు వీరి భేటీ జరగనుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నట్లు తెలుస్తోంది.
AP CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. రేపు (జూలై 4) ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.15 గంటలకు వీరి భేటీ జరగనుందని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం చేయడంతో పాటు, ఇతర అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నట్లు తెలుస్తోంది.
మోదీతో భేటీ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ తర్వాత, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీకి పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని సహా రాష్ట్ర ఆర్థిక లోటు పరిస్థితులపై ముఖ్యమంత్రి కేంద్రానిక ఓ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
#WATCH | Andhra Pradesh CM N Chandrababu Naidu arrives at Delhi airport.
— ANI (@ANI) July 3, 2024
He is likely to call on PM Narendra Modi tomorrow, 4th July. pic.twitter.com/eCICegLv0I