అన్వేషించండి

AP Budget Session 2024: ఫిబ్రవరి 5 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు-6న బడ్జెట్‌

AP Assembly News: ఏపీ బడ్జెట్‌ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానుండగా... 6వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది జగన్‌ సర్కార్‌.

Andhra Pradesh Assemby Budeget Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSRCP) ప్రభుత్వం. ఫిబ్రవరి 5  నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనుండగా... 6వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టనుంది జగన్‌ సర్కార్‌. ఈ బడ్జెట్‌ సమావేశాలు మూడు నుంచి ఐదు రోజుల పాటు  జరుగుతాయని సమాచారం. 

ఎన్నికల వేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఖర్చుల కోసం అవసరమైన నిధులను కాన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకుంటారు.  దీనికి ఆమోదం తెలపడం కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం  జరుగుతుంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే దృష్టి సారిస్తుందని తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని  కేటాయింపులు చేయనుంది. 2023-24తో పోలిస్తే మొత్తం వ్యయం 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై త్వరలో తుది  నిర్ణయం తీసుకోనున్నారు. 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో తెలుగుదేశం పార్టీ హయాంలోని 2014-19తో పోలుస్తే... ఈ ఐదేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని  హైలైట్ చేసే అవకాశం ఉంది. రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న రుణాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని... బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్టు  సీనియర్‌ అధికారులు చెప్తున్నారు. సంక్షేమ పథకాల వ్యయం, ఉపాధి కల్పనకు సంబంధించిన కీలక డేటాను ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపినట్లు తెలుస్తోంది. 

గత బడ్జెట్‌ వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను... 2లక్షల 79వేల 279 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది, ఇందులో సింహభాగం నవరత్నాల కింద అమలవుతున్న ప్రధాన  సంక్షేమ పథకాలకే కేటాయించింది. రెవెన్యూ వ్యయం 2లక్షల 28వేల 540 కోట్లు కాగా.... మూలధన వ్యయం 31వేల 61 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు 22,316కోట్లు  ఉండగా... ద్రవ్య లోటు రూ.54,587 కోట్లుగా ఉంది. ఆర్థిక లోటు GSDPలో 3.77 శాతం కాగా... రెవెన్యూ లోటు GSDPలో 1.54 శాతంగా ఉంటుంది. ఇక... 2022-23లో బడ్జెట్  వ్యయం రూ.2.56 లక్షల కోట్లు కాగా... 2021–22లో బడ్జెట్‌ వ్యయం రూ.2.29 లక్షల కోట్లు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget