అన్వేషించండి

Private College Admission: ఆ ప్రైవేట్ కాలేజీల గుర్తింపు రద్దు చేయండి... ఏపీ ఇంటర్ బోర్డు ఆదేశం, చర్యలు

ఏపీలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021-22 విద్యా సంవత్సరానికి అనధికారికంగా అడ్మిషన్లు చేపట్టిన కళాశాలపై చర్యలకు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై ఇంటర్మీడియట్ బోర్డు మండిపడింది. 2021–22 విద్యా సంవత్సరానికి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని  ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్‌లైన్ విధానం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఇంటర్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల అవ్వకుండానే, ఆన్‌లైన్‌ అడ్మిషన్లు ఇంకా మొదలుపెట్టకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కళాశాలల్లో అడ్మిషన్లు పొందారని, ఫీజులు కూడా చెల్లించారని తమకు సమాచారం వచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను సదరు కాలేజీలు తక్షణమే తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్‌ఐవోలు వెంటనే గుర్తించి, గుర్తింపు రద్దు చేయాలని, అలాగే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న ప్రైవేట్ కళాశాల విషయంలో సైతం కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది. కరోనా కష్టకాలంలో స్టడీ మెటిరియల్, యూనిఫారాలు తప్పక కొనుగోలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్‌ ఇంటర్‌ కాలేజీ యాజమాన్యాలపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలలు ఒత్తిడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని తెలిపింది. ఫీజుల  విషయంలో ఒత్తిడి చేస్తున్న కళాశాలలపై మొయిల్‌, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. ourbiep@gmail.com ఈమెయిల్ లేదా 9393282578 నంబర్‌కు వాట్సాప్‌ లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

జూనియర్ కాలేజీలు దూకుడుకు ఇంటర్ బోర్డు కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టంది.  ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ లేకుండా కొన్ని  కాలేజీలు అడ్మిషన్లు చేపట్టాయి. ఈ వ్యవహారంపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. అడ్మిషన్లు తీసుకున్న కాలేజీలను వెంటనే ఫీజులు వెనక్కి ఇవ్వాలని, లేని పక్షంలో తీవ్రచర్యలు ఉంటాయని హెచ్చరించింది. అవసరమైతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు ఆదేశాలలో పేర్కొంది. 

Also Read: PV Sindhu: ఏపీ సీఎం జగన్ కలిసిన పీవీ సింధు... విశాఖలో త్వరలో అకాడమీ ప్రారంభం

                CJI Comments : న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల రక్షణకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదు : సీజేఐ ఎన్వీ రమణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Ayyanna Patrudu controversy: జాతరలో డప్పు కొట్టే వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన అయన్నపాత్రుడు - వీడియో వైరల్
జాతరలో డప్పు కొట్టే వ్యక్తి చెంప చెళ్లుమనిపించిన అయన్నపాత్రుడు - వీడియో వైరల్
Chandrababu: అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతిని అత్యుత్తుమ రాజధానిగా మారుస్తా - మావిగన్ పేరు కూడా పలకను - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam
Yuvraj Singh Slams SRH Management | కావ్య మారన్ నిర్ణయంపై యువీ అసహనం | ABP Desam
Abhishek Sharma Out vs KKR IPL 2026 | అభిషేక్ శర్మ అవుట్.. అంపైర్ తప్పిదమా? | ABP Desam
MS Dhoni Returns to Practice IPL 2026 | నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోనీ | ABP Desam
SRH Crushes KKR by 65 Runs IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ ఊచకోత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh NTR Vaidya Seva Scheme: ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
ఎన్టీఆర్ వైద్య సేవకు పదే పదే ఆటంకాలు - ప్రభుత్వ నిర్లక్ష్యం - పేదలకు కష్టాలు!
Amaravati Pin code: అమరావతికి కొత్త పిన్ కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
అమరావతికి త్వరలోనే ఆరు అంకెల కోడ్‌! ఈ వ్యవస్థ ఎలా ప్రారంభమైందంటే? 
Gen-Z Vastu: Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
Gen-Z కోసం అద్భుతమైన వాస్తు చిట్కాలు! ఈ మార్పులతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది!
IPL 2026 PBKS VS CSK Result Update: టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
టాప్ లేపిన పంజాబ్! చెన్నైపై ఘ‌న‌విజ‌యం!స‌త్తా చాటిన శ్రేయ‌స్, విజ‌య్, ఆర్య‌! సీఎస్కేకు వ‌రుస‌గా రెండో ఓట‌మి!
Rajasekhar: తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
తాత అని ఎవ్వరినీ పిలవనివ్వను, పిలవరు కూడా - రాజశేఖర్
Tamil Nadu Assembly Elections : విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
విజయ్ టిక్కెట్ ఇచ్చాడు కానీ ఆ అభ్యర్థి వెంట ఒక్కరూ కూడా ఉండటం లేదు -తిరుత్తణిలో టీవీకేకు షాక్!
IPL 2026 PBKS VS CSK Result Update:చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
చెపాక్‌లో హై డ్రామా – అంపైర్ పొరపాటు.. మాత్రే రికార్డుల వేట!
Rohit Sharma: వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
వింటేజ్ రోహిత్ శర్మ షో - ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్!
Embed widget