Amaravati Mahapadayatra: అమరావతి రాజధానికే కేంద్రం కట్టుబడి ఉంది... బీజేపీ కార్యాలయం అక్కడే కడుతున్నాం... మహాపాదయాత్రలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు
అమరావతి రాజధానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహా పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. 21వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో బీజేపీ అగ్రనేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేశ్, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ పలువురు రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గోన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న రైతులపై స్థానిక యువత పూలవర్షం కురిపించారు. పరిసర గ్రామాల నుంచి ప్రజలు ట్రాక్టర్లు, ఆటోల్లో తరలివచ్చి రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
Andhra Pradesh: BJP leaders participated in 'mahapadyatra' organised by farmers of Amaravati region against the tri-capital formula proposed by YSRCP Govt; visuals from Nellore
— ANI (@ANI) November 21, 2021
"Amaravati should be the only capital of the state,"says BJP national general secretary D Purandeswari pic.twitter.com/ZRUZsNvsIV
రైతులపై లాఠీఛార్జ్ దారుణం
నెల్లూరు జిల్లా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతులు సభ ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిలోనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో అమరావతిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఈ సభలో మాట్లాడుతూ రాజధానిపై ముందు నుంచి బీజేపీ ఒకే విధానానికి కట్టుబడి ఉందన్నారు. రైతుల మహా పాదయాత్రలో లాఠీ ఛార్జీలు చూసి చలించిపోయామన్నారు. అమరావతి రాజధానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Andhra Pradesh: BJP leaders participated in 'mahapadyatra' organised by farmers of Amaravati region against the tri-capital formula proposed by YSRCP Govt; visuals from Nellore
— ANI (@ANI) November 21, 2021
"Amaravati should be the only capital of the state,"says BJP national general secretary D Purandeswari pic.twitter.com/ZRUZsNvsIV
Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
ప్రజలే బుద్ధి చెబుతారు: కన్నా లక్ష్మీనారాయణ
అనంతపురం-అమరావతి రోడ్డు, ఎయిమ్స్ పనులు జరుగుతున్నాయని పురందేశ్వరి వివరించారు. రైతులను పక్కదారి పట్టించేందుకు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అని బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.
Also Read: ఏపీ వరద బాధితులకు అండగా ఉండండి... సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ ట్వీట్