News
News
X

AP Assembly Budget Sessions : ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు - ఏపీ ప్రభుత్వం కసరత్తు !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. మార్చిలో రెండు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించాల్సి ఉండటంతో త్వరగా నిర్వహించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

AP Assembly Budget Sessions :  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు  ఫిబ్రవరి చివరి వారంలో జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ సారి 20 రోజుల పాటు బడ్జెట్‌ సెషన్‌ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మార్చిలో అంతర్జాతీయ సదస్సులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడుల సదస్సు, జీ 20 సన్నాహాక సదస్సు కూడా మార్చిలోనే జరగాల్సి ఉంది. ఈ కారణంగా  ఫిబ్రవరిలోనే అసెంబ్లీని సమావేశపరిస్తే ఎలా ఉంటుందా అన్నదానిపైనా పరిశీలన జరుపుతున్నారు.  మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతోంది.. ఆ తర్వాత మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనున్నారు.  వీటికంటే ముందుగానే అసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ 2023-24ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నరా.ు 

ఇప్పటికే 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ 2,56,256 కోట్తో  బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ఏపీ ప్రభుత్వం.  2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ 2.65 లక్షల కోట్ల నుంచి2.75 లక్షల కోట్ల రూపాయల మధ్య  ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా శాఖలకు ఈ ఏడాది బడ్జెట్‌ ఏ మేరకు అవసరం అవుతుందనే అంచనాలు వేసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించారు.  ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు అంచనాలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు.. అవసరమైన మేరకే.. నిధులను కోరాల్సిందిగా సూచిస్తున్నారు.  గత ఏడాది తరహాలోనే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తుంది. అంతే కాదు వచ్చేది అంతా ఎన్నికల సమయమే కాబట్టి.. సంక్షేమానికి ఒకింత ఎక్కువే ఇవ్వాలి కాని, లోటు ఉండొద్దని ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దలు సూచించారు. 

ఇక అభివృద్ధి విషయంలోనూ ఈసారి ఎక్కువగా ఫోకస్‌ పెట్టక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది.అత్యంత ప్రాదాన్యత కలిగిన రోడ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రోడ్లకు భారీగానే నిధుల కేటాయింపు జరపాల్సి ఉంటుంది. అలాగే గృహ నిర్మాణంలోనూ ఇటీవల కాలంలో ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఇళ్ల నిర్మాణం విషయంలో కూడ టార్గెట్‌ను రీచ్‌ కాలేకపోతుందని.. కేవలం పది శాతం ఇళ్లను మాత్రమే కట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలతో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన నిధులను కేటాయించకుంటే.. ఎన్నికల నాటికి ఇళ్ల నిర్మాణం హామీని అమలు చేయలేకపోయామనే విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు.  గృహ నిర్మాణ శాఖకు భారీగానే నిధులు కేటాయించాల్సి ఉంది. ఇదే తరహాలో ఇరిగేషన్‌కు కూడా నిధుల ఎక్కువే కావాల్సి ఉంటుంది.ఒ వైపు సంక్షేమానికి.. మరోవైపు అభివృద్ధికి అదిక నిధుల కేటాయింపులే చేయాల్సిందేనన్న విషయం స్ఫష్టం అవుతుంది.
 
ఆదాయార్జన శాఖలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుందని అదికార వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్‌, రెవెన్యూ వంటి వాటి నుంచి మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా  ప్రణాళికలను తప్పని సరిగా రెడీ చేసుకోవాలి.అంతే కాదు  రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. రా  విద్య, వైద్యం వంటి రంగాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటున్నందున ఈ రంగాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులను రాబట్టగలమనే అంచనాలను కూడా సిద్దం చేస్తున్నారు ఆయా శాఖలకు చెందిన అధికారులు.

Published at : 20 Jan 2023 06:14 PM (IST) Tags: ANDHRA PRADESH AP Budget AP Assembly AP Assembly Budget Meetings

సంబంధిత కథనాలు

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్  !

Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !

Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక  అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?

MLA RK : మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం - సమస్యలను పరిష్కరించట్లేదని అడ్డుకున్న జనం !

MLA RK : మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం - సమస్యలను పరిష్కరించట్లేదని  అడ్డుకున్న జనం !

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్‌

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

APFSL Recruitment: ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌లో ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు - పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్‌ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్‌ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?

RBI Policy: దాస్‌ ప్రకటనల్లో స్టాక్‌ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?