అన్వేషించండి

Andhra News: మిగ్ జాం తుపాను ఎఫెక్ట్ - లోకేశ్ యువగళం వాయిదా

Nara Lokesh: మిగ్ జాం తుపాను నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్రకు 3 రోజులు తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Nara Lokesh Yuvagalam Postponed Due to Cyclone: రాష్ట్రంలో మిగ్ జాం తుపాను నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పాదయాత్రకు 3 రోజులు విరామం ఇవ్వనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కాకినాడ (Kakinada) జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు లోకేశ్ యువగళం పాదయాత్ర చేరింది. తుపాను ప్రభావంతో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను పూర్తిగా తగ్గిన తర్వాత ఈ నెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి 'యువగళం' ప్రారంభం కానుంది.

తుపాను పై చంద్రబాబు ఆందోళన

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు మిగ్ జాం తుపానుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. పటిష్ట చర్యల ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధిత ప్రజలకు పునరావాసం, ఆహారం అందించేలా చూడాలని పేర్కొన్నారు.

దూసుకొస్తున్న తుపాను

చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలో పుదుచ్చేరికి 200 కి.మీ దూరాన బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను వేగంగా దూసుకొస్తోంది. బాపట్ల దివిసీమ మధ్యలోనే మంగళవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరోవైపు, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

Also Read: తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget