అన్వేషించండి

Andhra News: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు - 2 రోజుల పాటు పర్యటన, దెబ్బతిన్న పంటలు పరిశీలన

Chandrababu: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మిగ్ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 8 నుంచి ఆయన 2 రోజుల పాటు తుపాను ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించనున్నారు.

Chandrbabu Tour in Michaung Cyclone Affected Areas: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మిగ్ జాం తుపాను (Michaung) ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటించనున్నారు. ఈ నెల 8 (శుక్రవారం) నుంచి 9 వరకూ ఆయన పర్యటన సాగనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గుంటూరు (Guntur), ప్రకాశం (Prakasam) జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి బాపట్లలో బస చేసి అనంతరం శనివారం పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావంతో నీట మునిగిన , దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం రైతులను కలిసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు

అంతకు ముందు ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తుపాను పట్ల అప్రమత్తంగా వ్యవహరించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయలేదని, దీని వల్ల వర్షాలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. పునరావాస కేంద్రాల్లోనూ ఆహారం, తాగునీరు సక్రమంగా అందించలేదని.. వారికి సహాయం అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు. హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల సమయంలో టీడీపీ హయాంలో ఎలా బాధితులకు సహాయం అందించామో గుర్తు చేశారు. ప్రత్యేక జీవోల ద్వారా బాధితులకు, రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

బలహీన పడిన తుపాను

తీవ్ర బీభత్సం సృష్టించిన మిగ్ జాం తుపాను తీరం దాటాక కోస్తాను కుదిపేసింది. తుపాను ప్రభావంతో గుంటూరు, తిరుపతి, బాపట్ల, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, చిత్తూరు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. అటు ప్రకాశం నుంచి ఇటు అల్లూరి జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. తుపాను వాయుగుండంగా బలహీనపడి, తర్వాత అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పంటకు తీవ్ర నష్టం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget