By: ABP Desam | Updated at : 07 Mar 2023 06:24 PM (IST)
Edited By: jyothi
కబడ్డీ ఆడుతూ ఫార్మసీ విద్యార్థి మృతి!
Anantapuram News: గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ఎక్కడి వాళ్లక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థుల నుంచి 40 ఏళ్ల వయసు వరకున్న వాళ్లు ఎక్కువగా మృత్యు ఒడికి చేరుతున్నారు. తాజాగా అనంతపురుంలో బీ ఫార్మసీ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. 19 ఏళ్ల వయసు ఉన్న ఓ విద్యార్థి కబడ్డీ ఆడుతూ.. గ్రౌండ్ లోనే ప్రాణాలు కోల్పోయాడు.
(తునూజ నాయక్)
అసలేం జరిగిందంటే..?
అనంతపురం పట్టణంలోని పీవీపీకే కళాశాలలో 19 తునూజ నాయక్ బీ ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 1వ తేదీన కాళాశాల గ్రౌండ్ లో కబడ్డీ ఆడుతూ.. తనూజ నాయక్ గ్రౌండ్ లోనే హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన విద్యార్థులు, సిబ్బంది.. తనూజ నాయక్ ను వెంటనే బెంగళూరులోని ఎమ్మెస్ రామయ్య ఆస్పతత్రికి తరలించారు. ఇన్నాళ్లుగా చికిత్స పొందుతున్న తనూజ నాయక్ ఈరోజు తుదిశ్వాస విడిచాడు. మృతుడు తనూజ నాయక్ ది మడకశిర మండలంలోని అచ్చంపల్లి తండాకు చెందిన వాడు. ఆడుతూ పాడుతూ హాయిగా తిరుగుతూ చదువుకుంటున్న యువకుడు గుండెపోటుకు గురై చనిపోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కబడ్డీ ఆడుతుండగా హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిన తనూజ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన ప్రతీఒక్కరూ అయ్యో పాపం అనుకుంటున్నారు. అసలేమైంది ఇంత మంది ఇలా గుండెపోటుతో చనిపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
నిన్నటికి నిన్న కెనడాలో మృతి చెందిన తెలంగాణ వైద్య విద్యార్థి
మొన్నటి వరకూ ఇక్కడే ఉండి చదువుకుంది. ఉన్నత చదువుల కోసం నెల రోజుల క్రితం కెనడా వెళ్లింది. బాగా చదివి.. డాక్టర్ గా తిరిగిరావాలనుకున్న ఆమె కల.. కల్లలాగే మిగిలిపోయింది. గుండెపోటుతో పోయిన నెలరోజులకే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి అంది వచ్చిన బిడ్డ చనిపోవడంతో తట్టుకోలేకపోతున్నారు.
కెనడా వెళ్లి నెల రోజులు గడవకముందే.. గుండెపోటు
నిజాబామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ) గ్రామ సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమార్తె పూజితా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. అలాగే పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాఆలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26వ తేదీన కెనడా వెళ్లింది. సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో వారం ఉండి.. అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. పది రోజుల కిందట హాస్టల్ లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ పూజితా రెడ్డి మృతి చెందింది.
అయితే అక్కడే ఉన్న పూజిత సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడే అంత్య క్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
AP MLC Elections: ఆ 16 మంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటు టీడీపీకే - గోరంట్ల, నిమ్మల కీలక వ్యాఖ్యలు
Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య