America Marriage : అమెరికాలో పెళ్లి బాజాలు, అనంతలో భోజనాలు
America Marriage : అమెరికాలో తెలుగు అబ్బాయి పెళ్లిని అనంతవాసులు డిజిటల్ తెరపై వీక్షించారు. అమెరికాలో జరిగిన కొడుకు వివాహాన్ని బంధుమిత్రులు వీక్షించేందుకు ఆన్ లైన్ లో లైవ్ పెట్టారు.
America Marriage : ఆన్లైన్ సౌకర్యం పుణ్యమా అని అమెరికాలో జరిగిన పెళ్లిని అనంతవాసులు డిజిటల్ తెరపైన వీక్షించారు. అమెరికాలో పెళ్లి జరగగా వివాహ భోజనాలు మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగాయి. వీసా సమస్యల కారణంగా పెళ్లి కుమార్తె ఇండియాకు రాలేకపోయింది. దీంతో తప్పని పరిస్థితులలో అమెరికాలో వధూవరులు నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్లందరూ అమెరికాలోనే పెళ్లి తంతు ముగించారు. ఆ పెళ్లిని అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిజిటల్ స్క్రీన్స్ పై బంధుమిత్రులు వీక్షించారు. వధూవరులను దీవించి అనంతం పెళ్లి భోజనాలు చేశారు.
డిజిటల్ స్క్రీన్ పై
తాడిపత్రి పట్టణానికి చెందిన రఘురాం రెడ్డి భాగ్యలక్ష్మిలా కుమారుడు కౌశిక్ కుమార్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ కు చెందిన సుప్రియ రెడ్డి కూడా అమెరికాలోనే ఉద్యోగం చేస్తోంది. ఇరువురి పెద్దలు వీరిద్దరికి పెళ్లి నిశ్చయించారు. కానీ పెళ్లి కుమార్తెకు వీసా రెన్యువల్ కాకపోవడం, వరుణ్ తల్లిదండ్రులకు సరైన సమయంలో వీసా లభించకపోవడంతో సమస్య తలెత్తింది. అనుకున్న ముహూర్తానికి అమెరికాలోని కొంతమంది తెలుగు వారు ఈ వివాహానికి పెద్దలుగా వ్యవహరించారు. ఇక్కడున్న బంధుమిత్రులకు వివాహ వేడుకలను చూపించాలని అనుకున్న రఘురాం రెడ్డి అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో భారీ డిజిటల్ తెరను ఏర్పాటు చేసి బంధుమిత్రులకు అమెరికాలో జరుగుతున్న వివాహ తంతును లైవ్ లో చూపించారు. సాంకేతికత పుణ్యమా అని ఎక్కడో అమెరికాలో జరిగిన వివాహాన్ని ఇక్కడ నుంచి చూడగలిగామంటూ బంధుమిత్రులందరూ ఆనందం వ్యక్తం చేశారు.
ఘనంగా పెళ్లి ఆ తర్వాత ఉద్యోగం
కొత్తగా పెళ్లి చేసుకోబోయే జంటలకు యూపీ సర్కార్ శుభవార్త చెప్పింది. నూతన వధూవరులకు ప్రభుత్వమే ఉద్యోగావకాశాలు కల్పించనుంది. యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఓ కాలేజ్ ఫంక్షన్‌కు హాజరైన ఆయన...ఈ విషయం వెల్లడించారు. సామూహిక వివాహ పథకం (Mass Marriage Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన వధూవరులకు ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పిస్తుందనితెలిపారు. "ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకంలో భాగంగా పేదింటికి చెందిన జంటలకు ప్రభుత్వమే వివాహం చేస్తుంది. ఆ తరవాత ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వాళ్ల అర్హతల ఆధారంగా ఉపాధి కల్పిస్తాం" అని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికీ పూర్తి స్థాయి న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే యోగి సర్కార్ పని చేస్తోందని స్పష్టం చేశారు. బల్లిలా జిల్లాలోని ఓ పీజీ కాలేజీలో సామూహిక వివాహాల కార్యక్రమానికి హాజరయ్యారు... దయాశంకర్ సింగ్. ఆ సమయంలోనే ఈ ప్రకటనలు చేశారు. దాదాపు 506 జంటలకు వేదమంత్రాల సాక్షిగా వివాహం జరిపించారు. దయాశంకర్ సింగ్‌తో పాటు ఎమ్మెల్యే కేట్కి సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కానుకలు అందజేశారు. యూపీ సర్కార్ గతంలోనే ఓ కీలక పథకం ప్రవేశ పెట్టింది. ముఖ్యమంత్రి సామాజిక్ వివాహ్ పథకంలో భాగంగా...అమ్మాయి పెళ్లికి ఆర్థిక సహకారం అందిస్తోంది. పేద కుటుంబాలకు చెందిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు వివాహం చేసుకున్నా...వారికీ ఆర్థిక సహకారం అందజేస్తోంది.