AP News: పీకలదాకా తాగి నాగు పాముతో యువకుడి సైయ్యాటలు! రోడ్డుపై గంటకు పైగా టెన్షన్!
Telugu News: మద్యం మత్తులో ఓ యువకుడు నాగుపాముతో చెలగాటం ఆడుతూ కనిపించాడు. గంటపాటు నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. చివరికి పాముకాటుకు గురయ్యాడు.
Satyasai District News: మందుబాబులు మద్యం మత్తులో లోకాన్నే మరిచిపోతుంటారు. నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాదు, ఇంకా ఎక్కువైతే ఏం చేస్తున్నారో, ఎవరితో పెట్టుకుంటున్నారో కూడా వారికే గుర్తుండదు. మందుతాగితే వారికి వారే మహారాజుల్లా ఫీలవుతుంటారు. కొండలను పిండి చేయగలమన్న నమ్మకం, ఎవరినైనా ఢీకొట్టగలిగే ధైర్యం వస్తుంది. కానీ మత్తుదిగితే కానీ వారికి తాము చేసిన పిచ్చి పని అర్థం కాదు.
సత్యసాయి జిల్లా కదిరిలో..
మద్యం మత్తు ఫుల్లుగా తలకెక్కిన ఓ వ్యక్తి తాను ఏం చేస్తున్నాడో అర్థంకాకుండా పాముతో చెలగాటం ఆడాడు. చివరికి కాటు వేయించుకున్నాడు. తన దారిన పోతున్న పామును బయటకు లాగి కెలికి వేధించడం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని కదిరిలో మద్యం మత్తులో నడిరోడ్డుపై నాగరాజు అనే యువకుడు పాముతో హల్చల్ చేశాడు. గంటసేపటికిపైగా కదిరి - అనంతపురం ప్రధాన రహదారిపై పాముతో నాగరాజు ఆటలాడటం చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన పేరు కూడా నాగరాజు కాబట్టి తనకేమీ కాదని ధీమా అయ్యుండొచ్చు.
గంటకుపైగా పాముతో ఆటలు
మద్యం సేవించి అటుగా వెళుతున్న నాగరాజుకు రోడ్డుపై వెళ్తున్న ఒక నాగుపాము కంటపడింది. అయితే అదేదో తాను పెంచుకున్న పాములాగా ఆటలాడటం మొదలుపెట్టాడు. పడగ విప్పిన ఆ నాగుపై ఈ నాగరాజు మద్యం మత్తులో కొడుతూ కాలితో తన్నుతూ చూస్తున్న వారిని ఆనందపరచడానికి హీరోలా ప్రవర్తించాడు. అటుగా వెళుతున్న వారు ఎంత వారించినా తన చెవికి ఎక్కించుకోకుండా ఆ పాముతో పరాచకాలాడి ఆఖరుకి ఆ పాముతోనే కాటు వేయించుకున్నాడు.
కాటు వేసినప్పటికీ అక్కడి నుంచి ఆ యువకుడు వెళ్లకుండా దానితో మళ్లీ ఆటలు ఆడటం మొదలుపెట్టాడు. పాము కాటు వేసిన కొద్దిసేపటికి చేతికి నొప్పి రావడంతో చేతిని వదిలించుకుని కోపంతో ఆ పామును కాలితో తన్నడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా పామును మెడలో వేసుకుని రోడ్డుపై తిరగసాగాడు నాగరాజు. అదిచూసిన స్థానికలు భయాందోళనకు గురయ్యారు. ఆ పాము పొలంలోకి వెళ్తున్నప్పటికీ దాన్ని వదలకుండా చేత్తో పట్టుకొని బయటికి లాగుతూ మరింత అతి చేస్తూనే ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న నాగరాజును పాము కాటు వేసినా తనకి ఏమీ కాకపోవడం ఇక్కడ విశేషం.
Drunken Antics with Cobra in Kadiri Ends in Hospitalization
— Sudhakar Udumula (@sudhakarudumula) July 24, 2024
In a bizarre and dangerous incident, a young man named Nagaraju from Kadiri in Sathyasai district found himself in the hospital after deciding to play with a cobra while intoxicated.
The drama unfolded near a degree… pic.twitter.com/mjmuBqTAgT