అన్వేషించండి

Jagan: ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్లు ముద్దన్న జగన్- పాత వీడియోలు చూపిస్తూ నిలదీస్తున్న నెటిజన్లు

Andhra Pradesh: ఈవీఎంలపై పెను దుమారం రేగుతున్న వేళ... వ్యతిరేకిస్తున్న వారితో మాజీ సీఎం జగన్ కూడా గొంతు కలిపారు. ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్ వాడితేనే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందని అభిప్రాయపడ్డారు.

EVM Controversy: ఈవీఎంలపై విమర్శలు వస్తున్న వేళ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు. 

"న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి అభివృద్ధి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో EVMలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి." అని జగన్ ట్వీట్ చేశారు. 

జూన్ 4న ఫలితాలు వచ్చిన రోజునే స్పందించిన జగన్ మోహన్ రెడ్డి... తాము ప్రజలకు ఎంతో మేలు చేశామని వాళ్లు వేసిన ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. చాలా అనుమానాలు ఉన్నప్పటికీ దానికి తగ్గ ఆధారాలు లేవని అన్నారు. అప్పటి నుంచి వైసీపీ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు నేరుగా జగన్ మోహన్ రెడ్డే ఈవీఎంలపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది.

అయితే జగన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు అంతకు ముందు చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసినప్పుడు జగన్ స్పీచ్‌లను వైరల్ చేస్తున్నారు. అప్పట్లో ఈవీఎంలను మ్యానుపులేట్ చేయవచ్చన్న చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జగన్. అసలు ఈవీఎంలలో ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదని ఉదాహరణతో వివరించారు. ఎవరికి ఓటు వేస్తున్నామో వీవీ ప్యాట్‌లో కనిపిస్తుందని అన్నారు. ఒక వ్యక్తిత తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తే వీవీప్యాట్‌ స్లిప్‌లో వేరే పార్టీ గుర్తు కనిపిస్తే కచ్చితంగా ఆ వ్యక్తి ప్రశ్నిస్తారని అన్నారు. అలా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు ప్రశ్నించలేదని గుర్తు చేశారు. అప్పట్లో చేసిన ఈ కామెంట్స్‌ను జగన్‌కు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget