అన్వేషించండి

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు వస్తారా? జగన్‌కు సొము వీర్రాజు సవాల్

పోటీ ఉద్యమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, విద్వేషాలు రెచ్చ గొట్టడమే జగన్ విధానంగా ఉంద‌న్నారు సోమువీర్రాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా అని ప్ర‌శ్నించారు.

ఏపీ స‌ర్కారుపై బీజేపి నేత సొము వీర్రాజు తీవ్ర స్దాయిలో ఫైర్ అయ్యారు. అమ‌రావ‌తి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న విద్యాసంస్థలకు రహదారి నిర్మాణం కూడా చేయకపోవడంపై ఆయ‌న‌ మండిప‌డ్డారు. రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నాయకులు అక్క‌డ నెల‌కొన్న ప‌రిస్దితుల‌ను ప్ర‌త్యక్ష్యంగా ప‌రిశీలించారు. జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాను ఎండ‌గ‌ట్టారు. ఎయిమ్స్‌ ఆసుపత్రి, అమృత్ విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీని ప‌రిశీలించారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు వెళ్ళే మార్గాల‌్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అమరావతిలో అభివృద్ధి ఆపేసి... ఎడారిగా మార్చారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు సోము వీర్రాజు. జగన్ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల‌్లో అమృత, విట్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ యూనివర్శిటీలలో అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుతున్నారు. ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ఏపి ప్రభుత్వంపై ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఏపీ గురించి ఏమనుకుంటారో కూడా ఆలోచన చేయడం లేదని, ఈ తోలు మందం‌ ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోదని అసహ‌నం వ్య‌క్తం చేశారు.

పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్‌ను డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయాలని, యూనివర్శిటీ వాళ్లపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తన దృష్టికి వచ్చిందని వీర్రాజు అన్నారు. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపి‌వేయాలన్నారు. యూనివర్శిటీల‌కు వచ్చే ఒక్క రోడ్ కూడా బాలేదని, రెండు కోట్లు వ్యయం అయ్యే రోడ్ల పనులు పూర్తి చేయాల‌న్నారు. అన్నీ తెలిసినా జగన్ మొద్దు నిద్ర పోతున్నారని తెలిపారు. ఇక్కడే రాజధాని అని అధికారంలోకి వచ్చి మాట తప్పి, మడమ‌ తిప్పార‌ని, పరిపాలన వికేంద్రీకరణ అంటే అసలు జగన్‌కి అర్థం తెలుసా అని వీర్రాజు ప్ర‌శ్నించారు.

ఉత్త‌రాంధ్రకు కేంద్రం నిధులు....

విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం వేల కోట్లు నిధులు ఇచ్చిందని, విజయనగరం నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు నాలుగు రోడ్లును కేంద్రం విస్తరిస్తుంద‌ని తెలిపారు. నాలుగు లైన్లను ఆరు లైన్ల రహదారిగా కేంద్రం అభివృద్ధి చేసింద‌ని, జగన్ విశాఖకు చేసిందేమీ లేదని... ఉంటే చెప్పాలని స‌వాల్ విసిరారు. మూడేళ్లల్లో ఏమి చేశారో చెప్పాలని బిజేపి సవాల్ చేస్తుందన్నారు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్ర చేస్తారా అని ప్ర‌శ్నించారు. బిజేపి రైతుల ఉద్యమానికి అండగా ఉంటుందని, టిడిపి, వైసిపి ప్రభుత్వాల వల్లే నేడు వాళ్లు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.

జగన్ 11కి.మి రోడ్డు కూడా వేయలేక పోయార‌ని, మోదీ ఐకాన్ బ్రిడ్జి వేస్తున్నార‌ని వివ‌రించారు సోమువీర్రాజు. కోడూరు, మేదరమెట్ల రోడ్‌కు టెండర్లు పిలిచార‌ని, ఏపిలో అనేక వంతెనలు, జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. ఫొటోలకు ఫోజులిచ్చే జగన్‌కు.. రోడ్లు వేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. విజయవాడలో మూడు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ కేంద్రం కట్టిందని, జగన్‌కు దమ్ముంటే.. ముందు ఈ యూనివర్శిటీల వైపు వెళ్లే రోడ్లు వేయాలన్నారు.

పోటీ ఉద్యమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, అభివృద్ధి పట్టదు... విద్వేషాలు రెచ్చ గొట్టడమే జగన్ విధానంగా ఉంద‌న్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ము జగన్ కి ఉందా అని ప్ర‌శ్నించారు. ప్రజలను పక్కదారి పట్టించే ఉద్యమాలను జగన్ మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget