గుంటూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు- ఏ1గా ఉయ్యూరు శ్రీనివాస్ !
గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను పేర్కొన్నారు.
గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరికొందరు ఆసుపత్రిలో చేరారు. ఇంకొదరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.
గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉయ్యూరు శ్రీనివాస్‌ను పేర్కొన్నారు. అందుకే ఆయన్ని ఏ1గా చేర్చారు. క్యూలో జనాలను ఎక్కువ సమయం నిలబెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమానికి సరిపడా సెక్యూరిటీ ఇచ్చామని వివరిణ ఇచ్చారు. ఫస్ట్ కౌంటర్ వద్దే ప్రమాదం జరిగిందని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తానా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్న శ్రీనివాస్ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే ఆయన గుంటూరు సహా మూడు ప్రాంతాల్లో అన్న క్యాంటీన్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకలు పంపిణీకి యత్నించారు. మొదటగా గుంటూరు వెస్ట్‌లో చీరలు, సరకుల పంపిణీ చేపట్టారు.
#BREAKING | आंध्र प्रदेश के गुंटूर में भगदड़, 3 की मौत और 13 घायल @aparna_journo | @vivekstake#BreakingNews #AndhraPradesh #Guntur #Stampede pic.twitter.com/BrKyE47GbV
— ABP News (@ABPNews) January 2, 2023
ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబును చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. స్థానిక నాయకులను కూడా ఆయన ఆహ్వానించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన కాసేపటికే చీరల పంపిణీలో అపశ్రుతి జరిగిపోయింది. అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు రావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. బారికేడ్ల పై నుంచి జనం తోసుకొని రావడంతో ఘోరం జరిగిపోయింది.
ఘటన జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారికి పరిహారం కూడా ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, చీరల పంపిణీ చేసిన ఉయ్యూరు శ్రీనివాస్ కూడా ప్రకటించారు. మృతి చెందిన వారికి కుటుంబానికి ఒక్కొక్కరికి 31 లక్షలు అందనుంది. ఇందులో తెలుగుదేశం ఐదు లక్షలు ఇవ్వనుంది. ప్రభుత్వం తరఫున 2 లక్షలు అందించనున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున 20 లక్షలు సాయం ప్రకటించారు. ఇలా మొత్తంగా 31 లక్షల సాయం మృతుల కుటుంబాలకు అందనుంది. గాయపడిన వారికి యాభై వేలు ఇవ్వబోతున్నారు.
Another stampede reported at Chandrababu Naidu's meeting, this time in Guntur, AP. At least 3 killed, where People gathered in large numbers to get the Sankranti Kanuka (special ration kits). Incident took place after Naidu had left the venue. 2nd stampede in a week's time. pic.twitter.com/D50A3WOLPD
— Pinky Rajpurohit (ABP News) 🇮🇳 (@Madrassan_Pinky) January 1, 2023
మొన్న కందుకూరు, నిన్న గుంటూరులో తొక్కిసలాట జరగడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. అన్ని పార్టీల నుంచి విమర్శల దాడి తీవ్రమైంది.