By: ABP Desam | Updated at : 16 Mar 2023 10:38 AM (IST)
బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందే సభలో ఆందోళన- రెండో రోజు టీడీపీ సభ్యుల సస్పెండ్
బడ్జెట్ ప్రవేశ పెడుతున్న టైంలో కాసేపు గందరగోళం నెలకొంది. బడ్జెట్ కాపీని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చదవడం మొదలు పెట్టిన వెంటనే తప్పుడు లెక్కలు అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది.
అప్పుడే సీఎం జగన్ లేచి... వాళ్లను బయటకు పంపించేసి సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కావాలనే రాద్దాంతం చేయాలనే టీడీపీ లీడర్లు నిరసన చేస్తున్నారని మండిపడ్డారు.
తర్వాత చాలా సమయం టీడీపీ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ లీడర్లు వినలేదు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మాట్లాడుతూ... బడ్జెట్ వినడం ఇష్టం లేకపోతే వాకౌట్ చేయాలని టీడీపీ సభ్యులకు సలహా ఇచ్చారు. లేకుంటే బడ్జెట్ విన్న తర్వాత బడ్జెట్‌పై డిస్కషన్ సమయంలో కావాల్సినంత టైం ఇస్తామంటూ చెప్పారు. అయినా టీడీపీ లీడర్లు వెనక్కి తగ్గలేదు.
దీంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మట్లాడుతూ... టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేశారు. వారిని బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
మొదటి రోజు 12 మందిపై వేటు
ఏపీ అసెంబ్లీ నుంచి మొదటి రోజు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్ , నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. మిగిలిన సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు.
హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.మంగళవారం గవర్నర్ ప్రసంగం సందర్భంగా .. జగన్ ఆలస్యంగా వచ్చారని .. ఆయన కోసం గవర్నర్ వేచి చూశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కేశవ్ వ్యాఖ్యల్ని ఓ పత్రిక ప్రచురించింది. అలా జరగలేదని పయ్యావుల తప్పుడు ఆరోపణలు చేశారని ప్రివిలేజ్ మోషన్ ను అధికార పార్టీ సభ్యులు ప్రవేశ పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు ని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ముందుగా ఎలాంటి తీర్మానం లేకుండా నేరుగా సస్పెండ్ చేశారు. ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించడంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరలా వీరిద్దరి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని... వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Mlc Dokka Vara Prasad : సస్పెండ్ చేయగానే టీడీపీ నినాదం, ఇంతకన్నా ఫ్రూప్ ఏంకావాలి- ఉండవల్లి శ్రీదేవికి డొక్కా కౌంటర్
MLA Maddali Giridhar: "క్రాస్ ఓటింగ్ కోసం టీడీపీ నేతలు నన్నూ సంప్రదించారు, కావాలంటే కాల్ డేటా చూడండి"
Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు
Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాలపై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!