News
News
X

Amarnath Yatra Rescue Operation: అమర్‌నాథ్‌ యాత్రలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌పై ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల- మరో 72 గంటల పాటు సహాయక చర్యలు

అమర్‌నాథ్‌ యాత్రలో తప్పిపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికుల కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ప్రభుత్వం ప్రకటించింది. తాజా అప్‌డేట్స్‌తో బులెటిన్ విడుదల చేసింది.

FOLLOW US: 

మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రకృతి విపత్తు విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందని... అక్కడ చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. 

జులై 8న ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారని... సంబంధిత అధికారులతో మాట్లాడారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు చిక్కుకొని ఉంటే వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని కూడా చెప్పారని తెలిపింది. 

ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రెండు హెల్‌లైన్లు యాక్టివేట్ చేశామని పేర్కంది ఏపీ ప్రభుత్వం. అమరావతి సచివాలయంలో 1902 నెంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. అదే టైంలో 011-23384016 నెంబర్‌తో దిల్లీలోని ఆంధ్రాభవన్‌లో మరో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని పేర్కొంది. 
అక్కడితో ఆగిపోకుండా.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ హిమాన్షుశుక్లను శ్రీనగర్‌ పంపినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన యాత్రికులను గుర్తించి.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు పంపేలా అక్కడ స్థానిక అధికారులతో మాట్లాడారని తెలిపింది. 

ఇవాళ(సోమవారం) సాయంత్రం ఆరు గంటల వరకు 26 ఫోన్ కాల్స్‌ను అమర్‌నాథ్ యాత్ర హెల్ప్‌లైన్స్‌కు వచ్చాయని వివరించింది ప్రభుత్వం. దీంతోపాటు ఏపీ అధికారులు కశ్మీర్ అధికారులతో మాట్లాడి చాలా మంది ఆంధ్రప్రదేశ్‌ వాళ్లను స్వస్థలాలకు పంపించినట్టు పేర్కొంది. 

ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే మూడు పెద్ద యాత్రిక బృందాలను గుర్తించినట్టు తెలిపింది ప్రభుత్వం. అందులో ఒకటి తాడేపల్లిగూడెం వాళ్లదని. ఆ బృందంలో 20 మంది ఉన్నట్టు పేర్కొంది. మరో రెండు గ్రూప్‌లు నెల్లూరుకు చెందినవిగా తెలిపింది. వీరితోపాటు మరో 23 మంది వ్యక్తులను కూడా గుర్తించినట్టు వెల్లడించింది. 

ఈ సహాయక కార్యక్రమం మరో 72 గంటలపాటు కొనసాగిస్తామని ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉంటే సురక్షితంగా తీసుకొస్తామంది ప్రభుత్వం. రాజమండ్రికి చెందిన కొత్త పార్వతి ఆచూకి లభ్యం కాలేదని తెలిసిందని... ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి తప్పిపోయిన 37 మంది ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని కేంద్ర హోం సెక్రటరీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం జరిగి మూడు రోజులైనా తమ వారి ఆచూకి తెలియక బాధితుల కుటుంబం ఆందోళన ఉందన్నారు. వారికి నీరు, ఆహారం, మందులు అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వీళ్లను సురక్షితంగా స్వస్థలాలకు చేరేలే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి గురించి ఎలాంటి సమాచారం తెలిసినా బాధిత ఫ్యామిలీకి చేరవేయాలని సూచించారు. 

Published at : 11 Jul 2022 07:57 PM (IST) Tags: Government of Andhra Pradesh Amarnath Yatra Amarnath Yatra Rescue Operation

సంబంధిత కథనాలు

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు

MP Raghu Rama Krishna Raju : ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ చెప్పిన సీఐడీ బాస్, ఎంపీ రఘురామ సెటైర్లు

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

నేడు బలపడనున్న అల్పపీడనం - వర్షాలతో తెలంగాణలో 3 రోజులు ఎల్లో అలర్ట్, ఏపీలో ఇలా

టాప్ స్టోరీస్

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..