By: ABP Desam | Updated at : 20 Dec 2022 10:54 AM (IST)
మంత్రి అంబటి రాంబాబు, బాధితురాలు
ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బాధితులకు పరిహారం వస్తే అందులో సగం ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేస్తున్నారని పవన్ ఇటీవల ఆరోపించారు. బాధితులకు ఐదు లక్షల పరిహారం చెక్కు వస్తే వాటిలో నుంచి తమకు రూ.2 లక్షల లంచం అంబటి అడగడం సిగ్గుమాలిన చర్య అంటూ పవన్ కళ్యాణ్ ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన రైతు భరోసా యాత్ర సభలో ఆరోపించారు. అయితే, పవన్ కళ్యాణ్ ఆరోపణలపై స్పందించిన అంబటి రాంబాబు తాను ఎవరినైనా ఒక్క రూపాయి అడిగానని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఇప్పడు ఈ వ్యవహారానికి సంబంధించి లంచాల డిమాండ్ బాగోతం వీడియోలు బయటికి వచ్చాయి. అందులో స్వయంగా బాధితులే తమ గోడు వెళ్లబోసుకున్నారు.
సత్తెనపల్లి పట్టణంలో ఆగస్టు నెల 20వ తేదీన ఓ రెస్టారెంట్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు. వారిలో వడ్డెర కులానికి చెందిన తురకా అనిల్ కు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చింది. ఈ ఐదు లక్షల్లో నుంచి రెండున్నర లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి స్థానికంగా ఉన్న ఓ నేత సాయంతో మంత్రి అంబటి రాంబాబును కలిశామని బాధితులు చెప్పారు. అయితే, మంత్రి కూడా తనకు రెండు లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని ఖరాఖండిగా చెప్పారని బాధితులు చెప్పారు.
తమ కొడుకు చనిపోయిన డబ్బులు వస్తే తమ కూతురు పెళ్లి చేసుకుందామనే ఆశతో తాము ఉన్నామని, తీరా మంత్రి పరిహారం డబ్బుల నుంచి కూడా లంచం అడిగారని బాధితులు వాపోయారు. బాధితులు మంత్రిపై చేసిన ఆరోపణల వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను జనసేన సైనికులు మరింత వైరల్ చేస్తున్నారు.
కుటుంబానికి ఆధారం పోగొట్టుకుని..
గుంటూరు సమీపంలోని దాసరిపాలెం నుంచి తురక పర్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాదిన్నర కిందట సత్తెనపల్లి వచ్చి రోడ్డు పక్కనే పూరిల్లు వేసుకుని జీవిస్తోంది. పర్లయ్య, గంగమ్మలకు అనిల్ (17), సమ్మక్క (14) సంతానం. పర్లయ్య అనారోగ్యంతో ఇంటి దగ్గరే ఉంటుండగా గంగమ్మ ప్రైవేటు స్కూలులో ఆయాగా పనికి వెళ్తున్నారు. కుటుంబానికి ఆధారమైన అనిల్ ఆగస్టు 20న రాత్రి పట్టణంలోని వినాయక హోటల్‌లో డ్రైనేజీ గుంత శుభ్రం చేస్తూ చనిపోయాడు.
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
KarimnagarAssembly Election Results 2023: కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Chandra Babu Meeting : చంద్రబాబు రాజకీయ సమావేశాలు షురూ- తొలి భేటీలో ఏం చర్చించారంటే!
Trains Cancelled: విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు- ప్రత్యేక ట్రైన్స్ గడువు పొడిగింపు
Chandrababu Srisailam Tour: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Cyclone Michaung Updates: మిగ్జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
/body>