అన్వేషించండి

Pawan Kalyan: పవన్ విజృంభణ! పళ్లురాలగొడతా అంటూ తీవ్ర పదజాలం - చెప్పు చూపిస్తూ సీరియస్ వార్నింగ్

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారంపవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికార పార్టీపై చేసే విమర్శల డోసును మరింతగా పెంచారు. వైఎస్ఆర్ సీపీ నేతలను ‘‘కొడకల్లారా?, వెధవల్లారా?, సన్నాసుల్లారా?’’ అంటూ పదే పదే ఈ విపరీతమైన పదజాలం వాడుతూ దూషించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తన కాలి చెప్పు పైకి తీసి చూపుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. ‘చట్ట ప్రకారం విడాకులు ఇచ్చిన వారికి భరణం చెల్లించాను. మొదటి భార్యకు రూ.5 కోట్లు ఇచ్చాను. రెండో భార్యకు కూడా నా ఆస్తి రాసిచ్చా. అంతేకానీ, వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫినీలతో తిరగడం లేద’ని అన్నారు. ‘వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా’ అని తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం (అక్టోబర్ 18) పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

‘‘నాకు రాజకీయం తెలియనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!’’ అంటూ పవన్ కల్యాణ్ మరో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు.

8 ఏళ్లలో రూ.120కోట్లు సంపాదించా - పవన్
‘‘నేను స్కార్పియో వాహనాలు కొంటే ఎవరు ఇచ్చారని అడిగారు. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. గత 8 ఏళ్లలో నేను ఆరు సినిమాలు చేశాను. వాటి ద్వారా నాకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. దాని ద్వారా రూ.33 కోట్లకు పైగా ట్యాక్సులు కట్టాను. నా పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తీసి పార్టీ ఆఫీసు కోసం ఇచ్చాం. రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.12 కోట్లు ఇచ్చా. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం రూ.30 లక్షలు ఇచ్చాను. పార్టీ పెట్టిన దగ్గర నుంచి బ్యాంకు అకౌంట్స్ లో రూ.15.58 కోట్ల కార్పస్‌ ఫండ్‌ డొనేషన్స్ వచ్చాయి. కౌలు రైతు భరోసా యాత్ర కోసం రూ.3.5 కోట్లు వచ్చాయి. ‘నా సేన కోసం నా వంతు’ పిలుపునకు గానూ మరో రూ.4 కోట్లు అందాయి’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.

‘ఒంటి చేత్తో మెడ పిసికి చంపుతా నా కొడకల్లారా. నేను లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా. ఒంగోలు గోపాలనగరంలో వీధి బళ్లో చదివా. ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అని మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతా కొడకల్లారా. వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్‌లతోనా.. హాకీ స్టిక్ లతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే..’’ అని పవన్ చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. 

జగన్‌కు ఊడిగం చేసుకోండి.. కాపుల్ని లోకువ చేయొద్దు..
కడుపు కాలితే చేసే పోరాటమే యుద్ధం. ఈ పోరాటం నా గుండెల్లో ఎలా ప్రవేశించిందో తెలుసా? నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని నేను ఊరికే చెప్పలేదు. పల్నాటి బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకుని చెప్పా. వైఎస్ఆర్ సీపీలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోవచ్చు.. కానీ మొత్తం కాపులను మాత్రం లోకువ చేయడానికి వీల్లేదు’’ అని పవన్‌ కల్యాణ్ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget