అన్వేషించండి

Pawan Kalyan Visits Gurudwara: నాందేడ్ గురుద్వారాలో చాదర్ సమర్పించిన పవన్ కళ్యాణ్.. వెంట మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర నాందేడ్ లో ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు. ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ కి సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో కలసి పవన్ కళ్యాణ్ గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు.


Pawan Kalyan Visits Gurudwara: నాందేడ్ గురుద్వారాలో చాదర్ సమర్పించిన పవన్ కళ్యాణ్.. వెంట మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని పవన్ కళ్యాణ్ కి, ఫడ్నవిస్ కి వేసి ఆశీర్వదించారు. అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.


Pawan Kalyan Visits Gurudwara: నాందేడ్ గురుద్వారాలో చాదర్ సమర్పించిన పవన్ కళ్యాణ్.. వెంట మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

పవన్ కళ్యాణ్ కి ఘన సత్కారం: అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ని ఛైర్మన్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు.


Pawan Kalyan Visits Gurudwara: నాందేడ్ గురుద్వారాలో చాదర్ సమర్పించిన పవన్ కళ్యాణ్.. వెంట మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్

గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం
గురుద్వారా సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BPCL Investment In AP: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీకి బీపీసీఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్!
ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1.27 లక్షల కోట్ల రిఫైనరీకి బీపీసీఎల్ బోర్డు గ్రీన్‌సిగ్నల్!
CM Chandrababu: వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది పోలవరం పూర్తి, మూడోసారి పుష్కరాలు నిర్వహించే భాగ్యం దక్కింది: సీఎం చంద్రబాబు
Rayapati Sambasiva Rao: మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు అస్వస్థత
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget