News
News
X

Ambati Rambabu: పోలవరం ఆలస్యం చంద్రబాబు వల్లే, ప్రెజెంటేషన్ ఇచ్చిన అంబటి రాంబాబు

సోమవారం అంబటి విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

FOLLOW US: 

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తుతం భిన్న రకాలుగా చర్చ జరుగుతున్న వేళ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి, కాపర్ డ్యాం పాడైపోవడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలేనని అన్నారు. పోలవరంపై ఎల్లో మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని అంబటి ఆరోపించారు. సోమవారం ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, పోలవరం ప్రాజెక్ట్‌ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

చంద్రబాబు నామినేషన్‌ పద్దతిలో కాంట్రాక్టర్లను తీసుకొచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా పారదర్శకత పాటించామని అన్నారు. కాఫర్‌ డ్యామ్‌ కట్టకుండా డయా ఫ్రమ్‌ వాల్‌ ఎలా కట్టారని నిలదీశారు? డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించారని, కాసుల కోసం కక్కుర్తిపడి చారిత్రాత్మక తప్పిదం చేశారని ధ్వజమెత్తారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ప్రభుత్వం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘చంద్రబాబు ట్రాన్స్ ట్రాయ్ అనే సంస్థను తప్పించి  నవయుగ అనే సంస్థకు పనులను అప్పగించారు. మేము రివర్స్ టెండర్ నిర్వహించి ప్రభుత్వానికి 12.6 శాతం నిధులను ఆదా చేశాం. కాఫర్ డ్యాం కట్టాక డయా ఫ్రం వాల్ కట్టాలి. కానీ చంద్రబాబు ఏం చేశారు? ఆయన ముందు చూపులేని ఫలితం వల్ల ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వైఎస్ఆర్ ప్రారంభించిన  పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం  చిత్తశుద్దితో తాము పనిచేస్తున్నామని అంబటి రాంబాబు  చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. పోలవరం భూ నిర్వాసితులకు పునరావాసం కోసం రూ. 1500 కోట్లు ఖర్చు చేసన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెక్రటరీలు, మంత్రులును మారిస్తే ప్రాజెక్టులు కొట్టుకుపోతాయా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. 

Published at : 25 Jul 2022 04:11 PM (IST) Tags: ambati rambabu polavaram project Chandrababu polavaram issue ambati rambabu on polavaram

సంబంధిత కథనాలు

IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

IAS Transfers: ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ - కొత్త పోస్ట్ క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా

AP Village Ward Secretariat : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్, త్వరలో బదిలీలు!

AP Village Ward Secretariat : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్, త్వరలో బదిలీలు!

CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్, సీఎం జగన్ ఆదేశాలు

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Telangana TDP Votes :  టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?