అన్వేషించండి

Alla Ramakrishna Reddy: జగన్‌ను తిట్టాలన్నారు, నాకు నచ్చలేదు - సొంతగూటికి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి

Mangalagiri MLA: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ పార్టీలో చేరారు. జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు.

MLA Alla Ramakrishna Reddy joined in YSRCP: గతేడాది చివర్లో వైసీపీ నుంచి వైదొలిగి, అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో మళ్లీ పార్టీలో చేరారు. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి వైసీపీలోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంగళవారం ఆళ్ల.. సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తన సన్నిహితులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ని తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని.. అది తనకు నచ్చలేదని అన్నారు. జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారని అన్నారు. కాంగ్రెస్ లో పద్ధతి పాడు ఏమి లేదని అన్నారు. ‘‘రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలి.. కాంగ్రెస్ పార్టీ కానీ షర్మిల విధానం అలా లేదు కేవలం వ్యక్తిగతంగానే ఉంటుంది. ఈ విషయంపై ఎన్నోసార్లు ఆమెతో పాటు పార్టీకి చెప్పి చూసాను కానీ వినలేదు. జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లడం నాకు నచ్చలేదు అందుకే ఆమెతో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వస్తున్నా’’ అని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సన్నిహితులతో అన్నట్లు తెలిసింది.

మంగళగిరిలో వైసీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా - ఆర్కే

‘‘వైఎస్‌ఆర్ సీపీ నాకు అన్ని రకాల అండగా ఉంది. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇచ్చిన పార్టీ. ఏది ఏమైనా మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి బీసీ సామాజికవర్గం నుంచే. వైసీపీ అంటే అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చాను. రెండు నెలలు పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది. 2019లో ఏవిధంగా ఓ ఓసి వర్గం చేతిలో ఓటమి చెందాడో అదే విధంగా 2024 ఎన్నికల్లో కూడా లోకేష్ బీసీ అభ్యర్థి చేతిలో ఓటమి తథ్యం. పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల ప్రయత్నం. విపక్షాల ప్రయత్నం ఫలించకూడదనే తిరిగి వైసీపీలో చేరాను.

మంగళగిరిలో వైసిపి అభ్యర్థిగాఎవరిని బరిలో నిలబెట్టినా గెలిపిస్తా. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్. మరోసారి మంగళగిరిలో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓటమి ఖాయం. మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఏవరనేది అధిష్టానం చూసుకుంటుంది’’ ఆర్కే అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
Bandi Sanjay: రంజాన్ భక్తులకే మినహాయింపా? అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంది?: బండి సంజయ్
రంజాన్ భక్తులకే మినహాయింపా? అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంది?: బండి సంజయ్
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
HYDRA Success: మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం
మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Akira Nandan Janasena Political Entry | పవర్ స్టార్ వారసుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా? |ABPSunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP DesamAdilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP DesamPawan Kalyan Maha kumbh 2025 | ప్రయాగ్ రాజ్ లో ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Counter to YSRCP: వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
వైసీపీ ట్రూత్ బాంబ్‌కు టీడీపీ కౌంటర్ ఇదే - ఎవరూ తగ్గట్లేదుగా !
Bandi Sanjay: రంజాన్ భక్తులకే మినహాయింపా? అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంది?: బండి సంజయ్
రంజాన్ భక్తులకే మినహాయింపా? అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపమేంది?: బండి సంజయ్
NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
HYDRA Success: మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం
మోకాలు లోతు తవ్వగా ఉప్పొంగిన గంగ, హైదరాబాద్‌లో ఫలిస్తున్న హైడ్రా చర్యలు - స్థానికులు హర్షం
Telugu TV Movies Today: రామ్ చరణ్ ‘రంగస్థలం’, వరుణ్ తేజ్ ‘ముకుంద’ to హరికృష్ణ ‘సీతయ్య’, రవితేజ ‘బలుపు’ వరకు - ఈ బుధవారం (ఫిబ్రవరి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
రామ్ చరణ్ ‘రంగస్థలం’, వరుణ్ తేజ్ ‘ముకుంద’ to హరికృష్ణ ‘సీతయ్య’, రవితేజ ‘బలుపు’ వరకు - ఈ బుధవారం (ఫిబ్రవరి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Mamata Banerjee On Kumbha Mela: మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
మమత బెనర్జీ Vs పవన్ కల్యాణ్- మహా కుంభ మేళాపై విమర్శలు
BRS Latest News: ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
ఆ మూడు కారణాలతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్‌ఎస్- గట్టిగా కొట్టాలని భారీ ప్లాన్
Jagan: జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
జగన్ పై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం - చట్టాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయబోమని హెచ్చరిక
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.