అన్వేషించండి

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు ఇచ్చింది. హాజరుకావాలని అధికారులు ఈ నెల 11న విచారణకు ఫోన్ ద్వారా స్పష్టం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అక్రమ మద్యం కేసులో ఈడీ నోటీసులు.
  • కారుమూరి రిమాండ్ పొడిగింపు, ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం ఆరోపణ.
  • మంత్రిగా అధికారం దుర్వినియోగం, రూ.87 కోట్ల కుటుంబ ఆస్తులు జప్తు.

గుంటూరు: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మద్యం సరఫరా వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ విచారణ నిమిత్తం ఆయన తప్పనిసరిగా ఈడీ కార్యాలయానికి రావాలని అధికారులు స్పష్టం చేశారు.

అయితే, ఈడీ అధికారుల నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు గానీ, సమాచారం గానీ అందలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఏ కేసులో విచారణకు హాజరుకావాలో తనకు చెప్పలేదన్నారు. కాగా, అంబటి రాంబాబుపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మరో కేసు నమోదు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.


మాజీ మంత్రి కారుమూరికి ఈ 25 వరకు రిమాండ్ పొడిగింపు

ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయన రిమాండ్‌ను సెప్టెంబర్ 25 వరకు పొడిగించడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా జరిగిన మద్యం రవాణా టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం చేకూర్చారని ఈడీ పేర్కొంది. కిలోమీటర్‌కు రూ.13 చెల్లించాల్సి ఉండగా, టెండర్ నిబంధనలు మార్చి రూ.35 వరకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కారుమూరి నాగేశ్వరరావు తన అధికారాన్ని ఉపయోగించి కుమారుడు సునీల్ కుమార్, ఆయన భాగస్వాములకు సబ్‌కాంట్రాక్టులు దక్కేలా చేశారని ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో హవాలా ద్వారా కారుమూరికి రూ.15 కోట్లు చేరినట్లు ఆధారాలు సేకరించింది. ఈ కేసులో కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేయగా, కారుమూరి కుటుంబానికి చెందిన రూ.87.7 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడం తెలిసిందే.

Frequently Asked Questions

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఎందుకు వచ్చాయి?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం సరఫరా కేసులో విచారణ నిమిత్తం అంబటి రాంబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 11న ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ ఎప్పటివరకు పొడిగించబడింది?

ఏపీ లిక్కర్ రవాణా స్కాం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్ సెప్టెంబర్ 25 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.

కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలు ఏమిటి, ఎంత నష్టం వాటిల్లింది?

మద్యం రవాణా టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లేలా చేశారని ఈడీ పేర్కొంది. కిలోమీటర్‌కు రూ.13 బదులు రూ.35 చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.

కారుమూరి కేసులో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఆస్తుల జప్తు ఎంత?

కారుమూరితో పాటు అతని కుమారుడు సునీల్, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈడీ అతని కుటుంబానికి చెందిన రూ.87.7 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
CM Chandrababu:సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
Jagan Letter To Sharmila: షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
షర్మిల తీరు బాధించింది, నా కూతుళ్ల విషయంలోనూ అదేమాట: సోదరికి జగన్ లేఖ
CM Chandrababu: పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
పంజాబ్ నుంచి కిరాయి ముఠాలు తీసుకొచ్చిన వైసీపీ ! జగన్ హయాంలో భారీగా ఏకగ్రీవాలు: సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Embed widget