By: ABP Desam | Updated at : 05 Jan 2023 09:14 AM (IST)
హిట్లర్, ముస్సోలిని తర్వాత చంద్రబాబే- ఏకవచనంతో రెచ్చిపోయిన ఆర్జీవీ
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సీరియస్ కామెంట్స్ చేశారు. నరహంతకుడు నారా చంద్రబాబు నాయుడు అనే ట్యాగ్‌తో యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో చాలా విమర్శలు చేశారు. పెద్దపెద్ద గ్రౌండ్స్‌లో సమావేశాలు పెడితే జనాలు రారని.. దాని ద్వారా పాపులారిటీ పడిపోయిందని అంటారేమో అన్న భయంతో చిన్న చిన్న ప్లేసెస్‌లో సమావేశాలు పెడుతున్నారని ఆరోపించారు ఆర్జీవీ.
కుక్కలకు బిస్కెట్లు వేసిన ప్రజలకు కానుకల ఎర చూపించి సభకు తీసుకొచ్చారని ఆరోపించారు ఆర్జీవీ. ఆ వచ్చిన వాళ్లకు కోసం సరైన కౌంటర్లు కూడా పెట్టలేదన్నారు. ఫొటోల కోసం కొంతమందికి కానుకలు ఇచ్చేసి వెళ్లిపోయారన్నారు. ఎంతమందికి ఇచ్చినా ఒకటే ఫొటో వస్తుందని అందుకే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు.
My comment on the MURDERS commited by @ncbn at kandhukoor and Guntur https://t.co/QMM48v37Sz
— Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2023
మూడుసార్లు సీఎం అయిన వ్యక్తికి ప్రజలు అంటే ఏంటో తెలియదా అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల ఇలా చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలియదా అని నిలదీశారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డితో సమానమన్నారు. కేవలం పర్సనల్ ఇగో తప్ప వేరే అవసరం చంద్రబాబుకు లేదన్నారు.
సభలకు వస్తే మందుస్తా అనే సంస్కృతిని ప్రవేశ పెట్టింది చంద్రబాబే అన్నారు ఆర్జీవీ. ఇది ప్రపంచంలోని అందరికీ తెలుసు అన్నారు. ఎంతమంది ప్రజలు పోతే మీ పాపులారిటీ అంత పెరుగుతుందని చంద్రబాబు ఫీల్ అవుతారని ఆరోపించారు. జనాల చావులను కొలమానంగా తీసుకోవడం చాలా హీనమైన చర్యగా అభివర్ణించారు. అలాంటి చోట ఇలా జరుగుతుందని చంద్రబాబు చెబితే ఎవరూ నమ్మరన్నారు. ఏకవచనంతో సంబోధిస్తూ విమర్శలు చేశారు ఆర్జీవీ. నాయకుడిగా ప్రజల సెక్యూరిటీని చూడకపోవడమేంటని ప్రస్నించారు. హిట్లర్, ముసోలీని తర్వాత చంద్రబాబునే ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యక్తిని చూశాను అన్నారు.
జగన్‌కు అనుకూలంగా సినిమా తీస్తున్న ఆర్జీవీ
అక్టోబర్‌లో సీఎం జగన్‌తో సమావేశమైన ఆర్జీవీ... ఆనయకు అనుకూలంగా రెండు సినిమాలు తీస్తున్నట్టు చెప్పారు. తన కొత్త సినిమాకు "వ్యూహం" అని పేరు పెట్టారు. తాను తీయబోయేది బయోపిక్ కాదని... బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ఆర్జీవీ అప్పట్లో ప్రకటించారు. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి “వ్యూహం” కథ వచ్చిందన్నారు. రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని... రాచకురుపుపైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం అని ఆర్జీవీ ప్రకటించారు.
కొండా సినిమా వచ్చిందో లేదో అన్నట్టు
ఆర్జీవీ ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల జీవిత కథ కొండాను తెరకెక్కించారు. ఆ సినిమా కనీస ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ధియేటర్లలో విడుదల చేసుకోలేకపోయారు. విడుదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రమోషన్లు మాత్రం చేశారు. ఆర్జీవీ టోటల్‌గా తన సినిమాలను పోర్న్ లెవన్ కంటెంట్ వైపు మార్చేసిన తర్వాత ఆయన తీసే సీరియస్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది.
అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ
ఈ మధ్య కాలంలో అషురెడ్డితో ఓ బోల్డ్ ఇంటర్వ్యూను చేశారు. అందులో వర్మ అషురెడ్డి పాదాలకు ముద్దు పెట్టడం సన్సేషన్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అయింది. శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడే స్ట్రెంత్‌ను అషురెడ్డిలో ఉందని అందుకే తనతో ‘డేంజరస్’ సినిమా గురించి ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. తన ఆలోచనా విధానం, లైఫ్ స్టైల్ పై అషు రెడ్డి కి కూడా రెస్పెక్ట్ ఉందని, అందుకే ఆ ఇంటర్వ్యూ సులువుగా చేయగలిగామని చెప్పుకొచ్చారు వర్మ. ఎంత పెద్ద పురుష వీరుడైనా కాంత దాసుడే అనే సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చున్నానని అన్సర్ ఇచ్చాడు వర్మ.
BJP On Jagan : దివాలా తీసిన కంపెనీ ఉద్యోగుల్లా ఏపీ ఉద్యోగుల పరిస్థితి - ప్రభుత్వ తీరుపై బీజేపీ విమర్శలు
ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?
CM Jagan on AP Capital: ఏపీ రాజధాని విశాఖపట్నమే, త్వరలోనే నేనూ షిఫ్ట్ అవుతున్నా - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వైఎస్ఆర్సీపీ నేతలతో సీఎం జగన్ కీలక భేటీ- ఏం చెప్పబోతున్నారు?
AP News Developments Today: ఏపీ రాజధానిపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ, సర్వత్రా ఉత్కంఠ
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఫోకస్లో Adani Enterprises, Sun Pharma
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని