AP Cabinet: రూ.1,600 కోట్లకు గ్యారెంటీ, ఆ చట్టంలో సవరణలకు ఆమోదం - ఏపీ క్యాబినెట్ మరిన్ని కీలక నిర్ణయాలు
సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ సీఆర్డీఏలో ఫేస్ - 1 ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు. ఆ చట్టంలో కొన్ని సవరణలు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకొనేలా వీలు కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. భావనపాడు పోర్టు నోటిఫికేషన్ - 1 లో సవరణలు చేయడం సహా, ఏపీ జీఎస్టీ డ్రాఫ్ట్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ..
* 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏపీ సీఆర్డీఏలో ఫేస్ - 1 ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ.1,600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు క్యాబినెట్ లో ఆమోదం తెలిపారు.
* ఏపీసీఆర్డీఏ 2014 చట్టంలో పలు సవరణలు చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ది కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకొనేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
* భావనపాడు పోర్టు నోటిఫికేషన్ - 1 లో సవరణలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.
* స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ లో ఆమోద ముద్ర
* ఆగస్టు 15, 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 20 మంది ఖైదీలకు ఉపశమనం కలిగించాలని క్యాబినెట్ లో నిర్ణయం
* తిరుపతి జిల్లాలో నోవాటల్ ఫై స్టార్ హోటల్ అభివృద్దికి క్యాబినెట్ ఆమోదం
* ఏపీ జీఎస్టీ సవరణ డ్రాఫ్ట్ బిల్లు 2022 కు క్యాబినెట్ ఆమోదం
* వైఎస్‌ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 379 లబ్దిదారులకు 7వ దశ పరిహారం చెల్లింపు
* వారి పట్టాలను రద్దు చేస్తూ భూమిని కార్పొరేషన్ కు హ్యాండోవర్ చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం
* ఆంధ్రప్రదేశ్ టెండెన్సీ యాక్ట్ 1956 ను రీపీల్ చేసే డ్రాఫ్ట్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
* పునురుత్పాదక ఇంధన ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020 కు సవరణలకు క్యాబినెట్ ఆమోదం
* వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమానికి ఆమోదం తెలుపుతూ క్యాబినెట్ లో నిర్ణయం జరిగింది.