అన్వేషించండి

Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు

AP News: హోం శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

AP Police News: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు కావాలి. విచారణలో పోలీసులు ఆలస్యం చేస్తే నేనే ఘటనా స్థలానికి వెళతా! శాంతి భద్రతల విషయంలో రాజీలేదు. పోలీసు సిబ్బందిలో అలసత్వాన్ని సహించేది లేదు. నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం కల్పించేలా పోలీసు శాఖ పని చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని చంద్రబాబు అన్నారు. నేరం జరిగిన తరువాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే...అసలు నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాలని సీఎం అన్నారు. ప్రజల భద్రతకు ఒక భరోసా ఇచ్చేలా పోలీసు శాఖ పనిచేయాలని.... పూర్తి స్థాయి శాంతి భద్రతలతో మళ్లీ ప్రశాంతమైన రాష్ట్రంగా ఏపీ కనిపించాలని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. హోం శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
 
గత ప్రభుత్వంలో 46 శాతం పెరిగిన నేరాలు
2014-19 పోల్చితే 2019-24లో  క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు. 2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్య కాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని  తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్యమైందో ప‌వ‌ర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

కాలం చెల్లిన‌ వాహనాలు
పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు  ఉంటే  అందులో 88 పనిచేస్తున్నాయని తెలిపారు. బాడీ వోర్న్ కెమేరాలు 1250 ఉంటే  444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు  కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని....వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య  5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని...ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.


Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు

నిధులు విడుదలకు సీఎం అంగీకారం

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్ధల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రూ.10 కోట్లు  వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సీసీ కెమేరాల ఏర్పాటులో పెండింగులో ఉన్న రూ.11 కోట్ల  బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖను ఆధునికీక‌రించే  కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుద‌ల చేయ‌డానికి  కూడా సీఎం ఆమోదం తెలిపారు. గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుంది కానీ.....పోలీసు శాఖ సామర్థ్యం మాత్రం పెంచేలేదని అన్నారు. నేర పరిశోధనలో కీలకమైన ఫింగర్ ప్రింట్ వంటి విభాగాలకు, పరికరాలకు కనీసం రూ.10 కోట్లు యాన్యువల్ మెయింటనెన్స్ చార్జెస్ చెల్లించకపోవడంపై ముఖ్యమంత్రి విస్మయం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget