అన్వేషించండి

Chandrababu: ఏపీలో పెండింగ్‌ బిల్లులు రూ.1,41,588 కోట్లు - చంద్రబాబు

గత ప్ర‌భుత్వ అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి స‌మీక్ష నిర్వ‌హించి వాస్త‌వ ప‌రిస్థితులు వివ‌రించేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రేపు శుక్ర‌వారం ఆర్థిక శాఖ‌పై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తారు.

AP Pending Bills: రాష్ట్రంలో అన్ని శాఖలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం, ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు వాటి వివరాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై బుధవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

CFMSలో అప్‌లోడ్ చేయ‌న‌వే రూ. 93 వేల కోట్లు

ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రేపు (జూలై 26న‌) శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్ల జగన్​ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్​ఎమ్​ఎస్(CFMS) ​లోకి అప్​లోడ్ చేయలేదన్న ప్రభుత్వం, 48 కోట్ల మేర బిల్లులు అప్​లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది.

ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు తేల్చింది. పెండింగ్‌ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్‌లోడ్‌ చేసినా చెల్లింపులు చేయలేదని తెలిపింది. నీటి పారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పింది. ‌వీటికి సంబంధించిన పూర్తి వివరాలు శ్వేతపత్రంలో వెల్లడించనుంది. 

వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలు గుర్తించారు. వీటిలో ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్ల బిల్లుల పెండింగ్‌
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకుపైగా బకాయిలు, మున్సిపల్‌ శాఖలో రూ.7,700 కోట్లకు పైగా బకాయిలున్న‌ట్టు ప్రాథ‌మికంగా గుర్తించ‌డం జ‌రిగింది.

‘వాస్తవాలకు దూరంగా చంద్రబాబు శ్వేతపత్రం’: అసెంబ్లీలో బీజేపీ నేత

చంద్రబాబు విడుదల చేసిన లిక్కర్ స్కాం శ్వేతపత్రంపై బీజేపీ ఎల్పీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ ఢిల్లీలోనే కాదు ఆంధ్రలో జరిగిందని టీడీపీ నేతలు ఎన్నికల ముందు నుంచే తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని కూడా వ్యాఖ్యానించారు. ఈ శ్వేతపత్రం వాస్తవాలకు దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రూ.30 వేల కోట్ల వరకు మద్యం స్కాం జరిగింది. రూ.99 వేల కోట్ల మేర నగదు అమ్మకాలు జరిపితే మూడు శాతం అక్రమాలే జరిగాయనేలా శ్వేతప‌త్రం ఉంది. దీనిని చూస్తే తాను ఎక్కడా దొరకలేదనే జగన్ సంబరపడతారు. ఈ విషయంపై సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget