సహనం నశించింది ఇక ఉద్యమమే - ప్రభుత్వానికి ఏపీ జేఏసీ నేత బొప్పరాజు హెచ్చరిక !
ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధం అయ్యామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా ప్రభుత్వానిదే బాధ్యతని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
Bopparaju ; ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు అని ఏపీ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది.ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ప్రభుత్వం వాడుకున్నా ఇంత వరకు ఓపికతోనే భరించామని, ఇక భరించలేమని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టే ఉద్యమాల వల్ల ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలిగినా...దానికి ప్రభుత్వానిదే పూర్తి బాద్యత అని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్దితి ఒకవైపు ఉంటే, మరోవైపు ఉద్యోగులు వారి కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా చెల్లించకపోవటం దారుణమని వీరంటున్నారు.
కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడం గతంలో మేము ఎన్నడూ చూడలేదని ఏపీ జేఏసీ నేతలు అవేదన వ్యక్తం చేస్తున్నరు. కుటుంబ అవసరాల కోసం డబ్బులు మాకు చెల్లించండి మహాప్రభో అని వేడుకుంటున్నా , మా మొరను ఆలకిస్తున్నారు గాని పరిష్కరించే నాధుడే కనిపించడంలేదని తెలిపారు. దాచుకున్న డబ్బులు కూడా మా అవసరాలకు మాకు ఇవ్వని కారణంగా, ఆడపిల్లలు పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకోవల్సిన పరిస్థితులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైనా సందర్బాలలో కూడా మెరుగైన చికిత్స చేయించుకోలేని దుర్బరమైన పరిస్దితులలో ఉద్యోగులు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో పిల్లల చదువుల ఫీజులు కట్టలేక స్కూలు,కాలేజ్ యాజమాన్యాలు ,పిల్లలను బయటకు పంపే పరిస్థితి ఏర్పడిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బ్యాంక్ లో సకాలంలో వాయిదాలు కట్టలేకపోతుంటే, వడ్డీల మీద వడ్డీలు తమ ఖాతాలో నుండి డెబిట్ అవుతున్నాయని,ఇలాంటి దారుణమయిన పరిస్దితి, వస్తుందని కలలో కూడ ఊహించలేదన్నారు. తమ బాధలు పదే.. పదే చెప్తున్నా, ప్రభుత్వంలో ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితే లేదని, తప్పనిసరి పరిస్దితుల్లో గత్యంతరం లేక, ఉద్యమానికి సిద్దపడాల్సి వస్తుందని వారు వెల్లడించారు.
తప్పని సరిపరిస్దితులలో ఉద్యోగులుగా చేపట్టే, న్యాయమైన ఉద్యమానికి,ప్రజలు,ప్రజా సంఘాలు మద్దతు కావాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.ఈ నెల 26 న విజయవాడ రెవిన్యూ భవన్ లో నిర్వహిస్తున్న ఏపి జెఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, కలిసొచ్చే ఇతర సంఘాలు..జేఏసీ లను కలుపుకుని, భవిష్యత్ ఆందోళన కార్రక్రమాల షెడ్యూల్ ను ప్రకటిస్తామని వారు తెలిపారు. 11 వ పిఆర్సీ లో పొందుపరచిన క్యాడర్ వారి స్కేల్స్ ని సంబంధిత శాఖాధిపతులకు నేటికీ పంపకపోవటం వలన, 2018 తర్వాత ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు వారి కొత్త పే స్కేల్ ఎంతో తెలియని పరిస్దితి ఉందని,కేవలం ప్రస్తుతం 2015-PRC స్కేలును, 2022-prc స్కేలుతో పోల్చుకుని జీతాలు డ్రా చేస్తున్నామని చెప్పారు.11వ PRC లో, చాలా శాఖలలో ఉద్యోగులకు స్పెషల్ పే లు, అలవెన్సులు పై కమిటీ నియమిస్తున్నాని చెప్పినప్పటికీ, నేటికీ ఎలాంటి ఉత్తర్వులు లేవని,దీని వలన చాలా శాఖలలో కొన్ని cadre ఉద్యోగులకు ఆర్ధిక నష్టం జరుగుతుందని తెలిపారు. 11వ పీఆర్సి (అమలు తేదీ 1.4.2020 నుండి 31.12.2021 మద్య కాలానికి) అరియర్స్ ఎప్పుడూ చెల్లిస్తారో తెలియకుండాపోయిందని వెల్లడించారు.