BITS Campus in Amravati: అమరావతిలో రూ.1000 కోట్లతో బిట్స్ ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు: కుమారమంగళం బిర్లా
Kumar Mangalam Birla | ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక ఏఐ ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ చాన్స్‌లర్ కుమారమంగళం బిర్లా తెలిపారు.

BITS Pilani to set up AI plus campus in Amravati | అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో AI ప్లస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు బిట్స్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్, బిజినెస్ మ్యాన్ కుమార మంగళం బిర్లా వెల్లడించారు. అమరావతి క్యాంపస్ ని మోడ్రన్ టెక్నాలజీ సెంటర్ గా తీర్చిదిద్దామని చెప్పారు. పిలానీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఏఐ ప్లస్ క్యాంపస్ (AI plus campus in Amravati) లో డేటా సైన్స్, రోబోటిక్స్, ఏఐ, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, కంప్యూరేషనల్ లింగ్విస్టిక్స్ తదితర కోర్సులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. రెండు దశల్లో మొత్తం ఏడు వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తా అన్నారు. 2025 నుంచి అందులో ప్రవేశాలు అవుతాయని తెలిపారు.
క్యాంపస్‌ల విస్తరణకు రూ.1200 కోట్లు
'వచ్చే ఐదేళ్లలో అమరావతిలో 1000 కోట్లు పెట్టుబడి పెడతాం. పిలానీతో పాటు హైదరాబాద్, గోవా క్యాంపస్ ల విస్తరణకు 1200 కోట్లు ఖర్చు చేస్తాం. 2030- 31 విద్యా సంవత్సరం నాటికి అక్కడ విద్యార్థుల సంఖ్యను 26 వేలకు పెంచుతాం. అమరావతి క్యాంపస్ లో రెండేళ్లు, విదేశీ యూనివర్సిటీల్లో రెండేళ్లు చదివేలా కోర్సులు. జాయింట్ పీహెచ్డీలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
అమరావతిలో క్యాంపస్ ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకోసం తక్కువ ధరకే భూములు ఇచ్చారు. చంద్రబాబు విజనరీకి తగ్గట్లుగా గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక విద్యుత్తు విధానాలతో క్యాంపస్ నిర్మిస్తాం. బిల్డింగ్ నమూనా ఎంపిక చివరి దశకు వచ్చింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏఐ, ఐఓటి ఆధారిత సేవలతో ఫస్ట్ డిజిటల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నా. అండర్ గ్రాడ్యుయేట్, స్మార్ట్ సిటీస్, ఏ ఫర్ హెల్త్ కేర్ ప్రత్యేక కోర్సులు అందిస్తాం' అని కుమార మంగళం బిర్లా తెలిపారు.
బిట్స్ కోరిన చోటే క్యాంప్ కోసం భూమి
అమరావతిలో క్యాంపస్ ఏర్పాటుకు CRDA 70 ఎకరాలు కేటాయించింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో భూమి కావాలనే బిట్స్ సంస్థ కోరింది. ఆలయ నమూనాలో కణాలను నిర్మిస్తామని సంస్థ తెలిపింది. దాంతో వారు కోరిన చోటే ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది.
అమరావతి క్యాంపస్ దేశంలోనే మొట్టమొదటి ఏఐ క్యాంపస్ కానీ వైస్ ఛాన్స్లర్ వి రామగోపాల్ రావు అన్నారు. Ai ద్వారా మేజర్ ప్రోగ్రామ్స్ తో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారని తెలిపారు. వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ సహా ఎన్నో రకాల కోర్సులు అందించేందుకు పలు దేశాల యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నాము అన్నారు.






















