AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
AP MPTC Election Reservations | ఏపీలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంది.

అమరావతి: ఏపీ ప్రభుత్వం త్వరలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లపై ప్రకటన విడుదల చేసింది.
జెడ్పీ చైర్మన్లు 28లో బీసీలకు 7 స్థానాలు, జెడ్పీటీసీలు 661లో 152 సీట్లు బీసీలకు కేటాయించారు. 661 ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు కేటాయించారు. ఎంపీటీసీలు 9913 స్థానాల్లో బీసీలకు 2400 స్థానాలు ఖరారు చేశారు. సర్పంచులు 13,351 స్థానాల్లో 3,128 స్థానాలు బీసీలకు కేటాయించారు. మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు..
28 జడ్పీ ఛైర్పర్సన్ల స్థానాల్లో బీసీలకు 7 స్థానాలు కేటాయింపు.
661 జడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు కేటాయింపు.
661 ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు కేటాయింపు.
9,913 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 2,400 స్థానాలు కేటాయింపు.
మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో బీసీలకు 36 (జనరల్ 18, మహిళ 18), ఎస్సీలకు 14 (జనరల్ 7 స్థానాలు, మహిళ 7), ఎస్టీలకు 3 (జనరల్ 2 స్థానాలు, మహిళ 1 స్థానం), జనరల్ మహిళలకు 27, అన్రిజర్వ్డ్గా 26 సీట్లు కేటాయించారు. ఓవరాల్గా మహిళలకు 50 శాతం మున్సిపల్ చైర్మన్ స్థానాలను కూటమి ప్రభుత్వం కేటాయించింది. కూటమి ప్రభుత్వం స్థానిక పోరుకు వేగంగా అడుగులు వేస్తుండగా, అక్టోబర్ 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాలకు కేటాయించిన రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
ఎస్టీలకు ఒకటి, షెడ్యూల్డ్ కులాలు (SC)లకు 2 స్థానాలు, వెనుకబడిన తరగతులు (BC)లకు 5,
మహిళలు (జనరల్) 5 స్థానాలు, అన్రిజర్వ్డ్ (జనరల్) 4 సీట్లు కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేసింది.
ట్రెండింగ్ వార్తలు























