News
News
వీడియోలు ఆటలు
X

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు - మంత్రి మేరుగు నాగార్జున

ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్లలో ఈ ఫిబ్రవరి నెల నాటికి 70.81 శాతం నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్లలో ఈ ఫిబ్రవరి నెల నాటికి 70.81 శాతం నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. 
నిధులను పూర్తిగా ఖర్చు చేయండి...
సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని, ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో  సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై మంత్రి వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు.
నిధులకు కొదవ లేదు...
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76 శాతం నుంచి 100 శాతం నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51శాతం నుంచి 75శాతం దాకా నిధులను వినియోగించిన శాఖలను బి-గ్రేడ్ గానూ,26శాతం నుంచి 50 శాతం వరకు నిధులను వినియోగించిన శాఖలను సి-గ్రేడ్ గాను, 25 శాతం వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డి-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు.

ఇప్పటి వరకు ఖర్చు ఎంతంటే...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధిక శాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు.  

సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు..అదికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. నిధుల వినియోగంపై వస్తున్న విమర్శలను కూడ ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని తిప్పికొట్టాలని అన్నారు.

Published at : 28 Mar 2023 08:54 PM (IST) Tags: YS Jagan YSRCP AP News Merugu Nagarjuna AP SC SUB PLAN

సంబంధిత కథనాలు

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ట్రాక్టర్ బోల్దా పడి ఆరుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ట్రాక్టర్ బోల్దా పడి ఆరుగురు మృతి

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Top 10 Headlines Today: తెలుగుదేశంతో పొత్తుపై బండి మాటేంటి? జయహో RRR అంటున్న స్పైడర్‌మ్యాన్

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Weather Latest Update: ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు!

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

టాప్ స్టోరీస్

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Wrestlers Protest: నిరసనల నుంచి సాక్షి మాలిక్ తప్పుకున్నారంటూ వార్తలు, ఫేక్ అని కొట్టిపారేసిన రెజ్లర్

Hyderabad News: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్‌, హెచ్ఆర్డీ కేంద్రం

Hyderabad News: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్‌లెన్స్‌, హెచ్ఆర్డీ కేంద్రం

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు

Minister Errabelli: ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం

Minister Errabelli: ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం