AP Congress News: పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో ఎన్నికలకు - ఏపీ కాంగ్రెస్ వెల్లడి
AP Congress News: పీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి వెల్లడించారు. ఆ పంచముఖ వ్యూహాలు కూడా తులసీ రెడ్డి వివరించారు.
Andhra Pradesh Congress News: ఏపీలో రాబోయే ఎన్నికల కోసం తాము పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా ఏపీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి వెల్లడించారు. ఆ పంచముఖ వ్యూహాలు కూడా తులసీ రెడ్డి వివరించారు. వాటిలో 1. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమరిచి చెప్పడం, 2. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడం, 3. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెప్పడం, 4. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పడం, 5. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠపరచడం అని వివరించారు.
ఆరు సూత్రాల్లో భాగంగా.. 1. రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, 2. రూ. 500 లకే వంటగ్యాస్ సిలిండర్ సరఫరా, 3. నిరుపేద కుటుంబాలకు నెలకు రూ. 6 వేలు ఆర్థిక సహాయం, 4. ప్రత్యేకహోదా అమలు, 5. రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజి అమలు, 6. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి చేయడంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల్లో మాదిరిగా గ్యారెంటీ పథకాలు అమలు చేయడం అని వివరించారు.