అన్వేషించండి

YS Jagan: బిజీబిజీగా సీఎం జగన్ - నిన్న ఎమ్మెల్యేలతో, నేడు రీజనల్ కోఆర్డినేటర్లతో కీలక సమావేశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన మరుసటి రోజే రీజినల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.

వరుస సమావేశాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీబిజీగా ఉంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన జగన్ మరుసటి రోజే రీజినల్ కో ఆర్డినేటర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
రీజినల్ కో ఆర్డినేటర్లతో సమావేశం....
వైసీపీ శాసన సభ్యులతో సోమవారం సమావేశం అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదే ఊపులో రీజినల్ కో ఆర్డినేటర్ల తో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలను మరింతగా వేగవంతం చేయటం, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లతో పాటుగా పార్టీలోని సీనియర్ లను కలుపుకొని వ్యూహాత్మకంగా స్థానిక పరిస్థితులను ఏప్పటికప్పుడు అంచనా వేసుకొని, రాజకీయం నడిపంచటం వంటి అంశాల పై జగన్ దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
కీలక సమావేశం...
పార్టీ  కార్యక్రమాలపై  ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో రోజు టచ్ లో ఉండేలా రీజినల్ కోఆర్డినేటర్లకు ముఖ్యమంత్రి జగన్  బాధ్యతలు అప్పగించనున్నారు. వాలంటీర్లు , గృహ సారథులును సమన్వయం చేసుకుని  కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా చూడాలని సమావేశంలో  చెప్పనున్నారు జగన్ మోహన్ రెడ్డి. త్వరలో ప్రారంభం అయ్యే జగనన్నే మన భవిష్యత్.. జగనన్నకు  చెబుదాంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ రీజనల్ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్  జిల్లా  పర్యటలో  కూడా ఎమ్మెల్యేలు స్థానిక నేతలను  సమన్వయం చేసుకునేలా రీజనల్ కో ఆర్డినేటర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఎమ్మెల్సీ ఫలితాల తరువాత అలర్ట్...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత జగన్ మరింత అప్రమత్తం అయ్యారని పార్టీలోనూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మరో ఏడాదిలో ఎన్నికలు ఉంటాయని స్పష్టంచేసిన జగన్ ఆ దిశగా పార్టీని మరింతగా సమర్దవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. అధికారిక కార్యక్రమాల్లో మార్పులు తీసుకువచ్చి, పార్టీకి ఎక్కువ సమయం ఇచ్చేలా జగన్ రూట్ మ్యాప్ ను డిసైడ్ చేశారని అంటున్నారు. దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాలు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో పార్టీలో నాయకత్వం, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇంచార్జ్ ల పని తీరు వంటి వివరాలను జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
నాలుగు కేటగిరీలుగా ఎమ్మెల్యేలు..
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నాలుగు కేటగిరీలుగా పార్టీ శాసన సభ్యులను విభజించారని వినిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను, ఇంచార్జ్ లను నాలుగు వర్గాలుగా విభించి వారిని ఆయా వర్గాల వారీగా ట్రీట్ చేయాలని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో మెదటి క్యాటగిరి, సీట్ ఇస్తే గెలిచేవారు. రెండో ది సీట్ ఇస్తే ఓడిపోయేవాళ్ళు, మూడోది సీట్ ఇవ్వకపోతే  వేరే పార్టీ లో చేరేవారు. నాలుగోది పార్టీ లోనే ఉండి నష్టం కలిగించేవారు. ఇలా నాలుగు రకాలుగా ఎమ్మెల్యేల విభజన చేపట్టి వారిని ఆయా పరిస్థితులకు అనుగుణంగా పని చేయించుకోవటం, లేదంటే ఎన్నికల సమయంలో పూర్తిగా పక్కన పెట్టడం లాంటి అంశాలపై జగన్ కీలక సమావేశంలో శాసన సభ్యులకు ప్రత్యక్ష్యంగా పరోక్షంగా స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. పనితీరు మాత్రమే కొలమానం అని పుకార్లకు పూర్తి దూరంగా ఉండాలని జగన్ ఇప్పటికే శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget