Mangalagiri News: మంగళగిరిలో అన్న క్యాంటిన్ ధ్వంసం - అర్ధరాత్రి హంగామా!
Mangalagiri News: నోటీసులు లేకుండా అన్న క్యాంటిన్ తొలగింపుకు పాల్పడగా నిర్వహకులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రేపటి నుంచి అన్నా క్యాంటిన్ పెట్టడానికి వీలు లేదు అంటూ హుకుం జారీ చేశారు.
Mangalagiri Anna Canteen: మంగళగిరిలో టౌన్ ఫ్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఓ టెంట్ లో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ ను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగింపునకు పాల్పడ్డారు. దీన్ని అన్నా క్యాంటిన్ నిర్వహకులు, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. రేపటి నుంచి అన్న క్యాంటిన్ పెట్టడానికి వీలు లేదు అంటూ హుకుం జారీ చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలి కానీ పేదలకి అన్నం పెట్టే క్యాంటీన్ టెంట్, సామాగ్రిని ధ్వంసం చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నించారు.
ఆర్వో ఆదేశాలను కాకుండా ఆర్కే ఆదేశాలను పాటిస్తున్నారా టౌన్ ప్లానింగ్ అధికారులని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా టౌన్ ప్లానింగ్ అధికారి వెళ్లిపోయారు. మంగళగిరిలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను మొదటి నుంచి అధికారులు, వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.