(Source: ECI/ABP News/ABP Majha)
AP Budget Sessions 2024: ఈ నెల 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు- ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న సమీక్ష
Andhra Pradesh Speaker Ayyanna Patrudu: 22 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పీకర్ అయ్యన్న అధికారులను ఆదేశించారు. మండలి ఛైర్మన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్ సమావేశాలు 22న నుంచి ప్రారంభంకానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవి. ఈ మధ్య ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమైంది. అప్పుడు ఎలాంటి సబ్జెక్టులపై చర్చించలేదు. 22న నుంచి జరిగే సమావేశాల్లో అన్ని అంశాలు చర్చించనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శ్వేత పత్రాలు కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది.
సోమవారం నుంచి అసెంబ్లీ సమవావేశాలు
సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రులు సమీక్, నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. ఏపీ శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుతో కలిసి సమావేశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
అవి రిపీట్ కావద్దు
సమీక్షలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గతంలో అసెంబ్లీ సమావేశాల టైంలో గ్యాలరీల్లో ప్లకార్డులతో కొంతమంది ప్రవేశించిన ఘటనలు చూశామని అలాంటివి రిపీట్ కావద్దని హెచ్చరించారు. అసెంబ్లీ గ్యాలరీల్లోకి ప్రవేశించే వారిని పూర్తిగా తనిఖీ చేశాకే అనుమతించాలన్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోనికి అనుమతించాలన్నారు.
కొత్త వాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి అసెంబ్లీ సమావేశాలకు 88 మంది కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు, 9మంది శాసన మండలి సభ్యులు రానున్నారని కావున వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని అన్ని సిసి కెమెరాలు సక్రమంగా పని చేస్తూ ఉండాలని చెప్పారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి, మీడియాకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భద్రత విషయంలో రాజీ పడవద్దని పోలీస్ శాఖ అధికారులను శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.
జిల్లాల నుంచి వచ్చే సిబ్బంది కోసం ప్రత్యేక ఏర్పాట్లు
శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ... "అసెంబ్లీ ప్రాంగణం అత్యంత ముఖ్యమైన భద్రతా జోన్ అని ఎవరుబడితే వాళ్లు ప్రవేశానికి వీల్లేదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగని రీతిలో బందోబస్తు ఉండాలని సూచించారు. సెక్యురిటీ, ఇతర నిర్వహణకు వివిధ జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించాలన్నారు. వారికి తాగునీరు, ఆహారం వంటి కనీస సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఢిల్లీలో ధర్నా - డుమ్మా కొట్టే వ్యూహమేనా ?
Also Read: వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందా ? - ఇదిగో పోలీసులు ఇచ్చిన క్లారిటీ