By: ABP Desam | Updated at : 15 Feb 2022 06:13 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైసీపీ నేత అలీ
సినీనటుడు, వైసీపీ నేత అలీ(Ali) మంగళవారం కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)ని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో అలీ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ ప్రముఖులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అలీ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం అలీకి రాజ్యసభ(Rajya Sabha) ఇస్తున్నారన్న ప్రచారం జరిగింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వచ్చాయి. ఆ సమావేశం అనంతరం మాట్లాడిన అలీ మళ్లీ ముఖ్యమంత్రితో కలుస్తానన్నారు. దీంతో ఇవాళ సీఎంతో అలీ భేటీ తర్వాత స్పష్టం వస్తుందని భావించారు. కానీ అలీ మాట్లాడుతూ త్వరలో పార్టీ నుంచి ప్రకటన వస్తుందని, అది రాజ్యసభ టికెట్(Rajya Sabha Ticket) లేక ఇంకేమైనా అనేది తెలియాల్సి ఉందన్నారు. రాజ్యసభ సీటు ప్రచారంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు స్పష్టత ఇచ్చేందుకు అలీ నిరాకరించారు. రాజ్యసభ సీటు విషయం తనకు తెలియదన్నారు. అలాంటి సంకేతాలు కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు. ఈ విషయమై అతి త్వరలోనే పార్టీ కార్యాలయం(Party Office) నుంచి ప్రకటన వస్తుందన్నారు.
వైఎస్ఆర్ పాదయాత్రలో
సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని వైసీపీ నేత అలీ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS RajaShekar Reddy) సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందన్నారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఆయనను కలిశానని తెలిపారు. పదవి ఇవ్వమని ఎప్పుడూ కోరలేదని అలీ అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్(Mla Ticket) కూడా ఆఫర్ చేశారన్నారు. సమయం లేక తానే వద్దనన్నారు. సోమవారం ఏపీ సీఎం కార్యాలయం(AP CM Office) నుంచి పిలుపు అందిందన్నారు. అందుకే ఇవాళ కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ ను కలిశానని అలీ తెలిపారు.
సినీ ప్రముఖులకు అవమానం అవాస్తం
సీఎం కార్యాలయంలో పలువురు మంత్రులను కలిసినట్లు అలీ తెలిపారు. ప్రచారం సమయంలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలను కూడా కలిశానన్నారు. ఏ పదవి ఆశించకుండా పార్టీలోకి వచ్చానన్న ఆయన... పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని ఎప్పుడూ అనలేదన్నారు. సీఎం జగన్‌తో తనకు ముందు నుంచే పరిచయం ఉందని అలీ అన్నారు. ఇటీవల సినిమా ప్రముఖులను పిలిచి అవమానించారన్నది అవాస్తమన్నారు. చిరంజీవి(Chiranjeevi) వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నారన్నారు. ఏపీలో సినిమా టికెట్ ధరలు సామన్యుడికి అందుబాటులో ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు. త్వరలో సినిమా(Cinema) ఇండస్ట్రీ కష్టాలు తీరుతాయన్నారు. ఇటీవల జరిగిన భేటీలో అన్ని విషయాలు సీఎంకు వివరించామన్నారు.
TDP Mahanadu Live Updates: మహానాడు ప్రారంభం, జ్యోతిప్రజ్వలన చేసిన చంద్రబాబు
TDP First Mahanadu : తొలి "మహానాడు" ఎవర్గ్రీన్ - ఆ విశేషాలు ఇవిగో
TDP Mahanadu: మహానాడుకు వెళ్లే వారికి పోలీసులు కీలక సూచనలు, ఇవి పాటిస్తే చాలా ఈజీగా వెళ్లిరావొచ్చు
Mahanadu 2022: టార్గెట్ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం
Weather Updates: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు - నేడు ఈ జిల్లాలకు వర్షం అలర్ట్
Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్
Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు
Karimnagar: సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ! ఏకంగా లాయర్నే బురిడీ - రూ.లక్షలు హుష్‌కాకీ!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్