By: ABP Desam | Updated at : 11 Jun 2022 08:17 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నాదెండ్ల మనోహర్ (File Photo)
Nadendla Manohar On Liquor Bonds : ఏపీలో మద్య నిషేధం అంటే మద్యం ఆదాయం పెంచడమే అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ సంపూర్ణ మద్యపాన నిషేధమంటూ అధికారం చేపట్టి ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల టైంలో మద్యం ద్వారా రూ.9 వేల కోట్ల ఆదాయం వస్తే వైసీపీ అధికారంలో వచ్చాక మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని మనోహర్ ఆరోపించారు. ఇదేనా వైసీపీ మద్యపాన నిషేధం అని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిందని నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.
స్పిరిటెడ్ విజనరీ
మద్యం రాబడి చూపించి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బాండ్లు అమ్ముతున్నారన్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇది స్పిరిటెడ్ విజనరీ అంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్ మేనిఫెస్టో పెట్టిన మద్యపాన నిషేధం ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. మద్యం ద్వారా అధిక ఆదాయం సంపాదించడంతో పాటు అప్పు కూడా తీసుకుంటూ సీఎం జగన్ జాక్‌పాట్ కొట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యనిషేధం పాక్షికంగా కూడా ఉండదని కార్పొరేషన్‌కు ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. వివిధ రకాల లిక్కర్ బ్రాండ్లను విడుదల చేసి జగన్ సర్కార్ రూ.8 వేల కోట్లు సేకరించిందన్నారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వానికి మూడు నెలలకు ఓసారి వడ్డీ ఇస్తామని కార్పొరేషన్ తెలిపింది.
సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ @ysjagan గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! 😊#SpiritedVisionary_Jagan pic.twitter.com/SxKIPVlRfP
— Manohar Nadendla (@mnadendla) June 11, 2022
రూ.8 వేల కోట్ల రుణాలు సేకరణ
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ బాండ్లను వేలం రూ. 8 వేల కోట్ల రుణాలను సమీకరించుకుంది. ఏపీ ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ( NCD ) ఆఫర్ చేసి రూ. రెండు వేల కోట్లను సమీకరించాలనుకుంది. అయితే అనూహ్యంగా ఈ ఎన్‌సీడీల పట్ల ఎక్కువ మంది ఆసక్తి చూపారు. ఐదు రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. అయితే తాము రూ. ఎనిమిది వేల కోట్లు మాత్రమే తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
9.5 శాతం వడ్డీతో
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి బాండ్లను వేలం వేసి రూ. రెండు వేల కోట్ల రుణాలను సమీకరించారు. ఇప్పుడు లిక్కర్ బాండ్లను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం మొత్తాన్ని ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభుత్వం పూర్తి చేసింది. రూ. ఎనిమిది వేల కోట్లకు 9.5 శాతం వరకూ వడ్డీ కట్టాల్సి ఉంటుంది. రేటింగ్ సంస్థలు స్టేబుల్ కేటగిరి కింద రేటింగ్ ఇవ్వడంతో రుణ సమీకరణ సులువు అయింది.
Andhra News: మిగ్ జాం తుపాను ప్రభావం - జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
Andhra News: మిగ్ జాం తుపాను ఎఫెక్ట్ - లోకేశ్ యువగళం వాయిదా
Top Headlines Today: ఏపీని భయపెడుతున్న మిగ్‌జాం తుపాను! తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు?
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>