CM Jagan : సీఎం జగన్ ను కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, షేక్ అర్షద్
CM Jagan : కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన ఏపీకి చెందిన క్రీడాకారులు బేబిరెడ్డి, షేక్ అర్షద్ సీఎం జగన్ ను కలిశారు. కామన్వెల్త్ గేమ్స్ లో గెలిచిన పతకాలను సీఎంకు చూపించారు.

CM Jagan : ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు సీఎం జగన్ ను కలిశారు. ఏపీకి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. బేబి రెడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, షేక్ అర్షద్ స్వస్థలం నంద్యాల. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్నారని క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా. క్రీడాకారులను అభినందించిన సీఎం. pic.twitter.com/xMDIoxeGN4
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 30, 2022
ప్రభుత్వ పరంగా సహకారం
జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ అన్నారు. క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో (జూనియర్స్ టీమ్)లో కాంస్య పతకం సాధించింది బేబి రెడ్డి టీమ్. తాను సాధించిన పతకాలను బేబిరెడ్డి సీఎం జగన్‌కు చూపించారు. జాతీయ స్థాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల దిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో షేక్ అర్షద్ వెండి, కాంస్య పతకాలు సాధించారు. తాను జాతీయ స్థాయిలో సాధించిన పతకాలను అర్షద్ సీఎంకి చూపించారు. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు సీఎంకు వివరించారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని కోరారు బేబి రెడ్డి, అర్షద్. ఇందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
సీఎం జగన్ తో టాటా ప్రతినిధులు భేటీ
సీఎం జగన్ తో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సీఎం జగన్‌తో టాటా ప్రతినిధులు చర్చించారు. అలాగే రక్షణ వైమానిక రంగంలో తయారీ, నిర్వహణ తదితర అంశాల్లో పెట్టుబడులు, అవకాశాలపై అధికారులు చర్చించినట్లు తెలిపారు. సీఎం జగన్ ని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జె. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంలో సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న విధానాలను టాటా ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ కార్పొరేట్ ఎఫైర్స్, రెగ్యులేటరీ హెడ్ జే. శ్రీధర్, టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హెడ్ మసూద్ హుస్సేనీ. pic.twitter.com/mFme10uTZN
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 30, 2022
Also Read : Plastic Vs Pawan Kalyan: ప్లాస్టిక్ వర్సెస్ పవన్ కల్యాణ్, మధ్యలో టీడీపీ సపోర్ట్ - ఏపీలో ఏం జరుగుతోంది !
Also Read : Vinayaka Mandapas Issue : ఏపీలో వినాయక మండపాల వివాదం, వ్యూహత్మకంగా వైసీపీ కౌంటర్ ఎటాక్!
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















