Amalapuram News : సీఎం పర్యటన ఏర్పాట్లు - అమలాపురంలో వందల చెట్ల నరికివేత ! జనసేన నేతల తీవ్ర విమర్శలు
అమలాపురంలో జగన్ పర్యటన కోసం పెద్ద ఎత్తున చెట్లు కొట్టేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
Amalapuram News : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఈనెల 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను అధికారులు తొలగించడం వివాదాస్పదం అవుతోంది. స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుంచి బాలయోగి ఘాట్ వరకు సీఎం రూట్ మ్యాప్ ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్లను అధికారులు కొట్టేశారు. ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన కోసం పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికి వేయడం దారుణం అంటూ విపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా సీఎం హెలికాప్టర్ దిగేందుకు ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లను నరికి హేలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. అవి ముఫ్ఫై ఏళ్ల వయసు ఉన్న చెట్లని.. వాటిని కొట్టేయాల్సిన అవసరం లేదని అమలాపురం ప్రజలు అంటున్నారు.
జగన్ విధ్వంస రాజకీయం
— JanaSena Party (@JanaSenaParty) July 21, 2023
జగన్ అమలాపురం పర్యటన కోసం దారిపొడవునా చెట్లు నరికిస్తున్న అధికారులు, అడ్డుకున్న జనసేన నాయకులు.#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan pic.twitter.com/BJj049xdPi
అమలాపురంలోని ఎస్ కే బీ ఆర్ కళాశాల, కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు హెలీ ప్యాడ్ లు ఉన్నప్పటికీ అవి పరిగణలోకి తీసుకోకుండా రూ. 15 లక్షలు ప్రజాధనం వెచ్చించి.. పెద్ద ఎత్తున చెట్లను కొట్టి వేసి.. కొత్త హెలీప్యాడ్ నిర్మించారన్న విమర్శలు వస్తున్నాయి.
జగన్ విధ్వంస రాజకీయం !!
— గోదావరి జనసైన్యం (@Ewjanasainyam) July 21, 2023
జగన్ అమలాపురం పర్యటన కోసం దారిపొడవునా చెట్లు నరికిస్తున్న అధికారులు, ప్రభుత్వ విధ్వంసాన్ని ప్రజలకు తెలియచేస్తున్న అమలాపురం ఇంఛార్జ్ @srb4people గారు ✊✊@JanaSenaParty@PawanKalyan pic.twitter.com/5IdO0GkLYw
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసానికి నిదర్శనం అని, మరోసారి అమలాపురంలో నిరూపితమవుతుందని చెట్లు నరికివేతపై జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు విమర్శలు గుప్పించారు. అమలాపురం చెట్ల నరికి వేత వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
జగన్ విధ్వంస రాజకీయం
— Bujji katika (@LakshmiGeddam2) July 21, 2023
జగన్ అమలాపురం పర్యటన కోసం దారిపొడవునా చెట్లు నరికిస్తున్న అధికారులు, అడ్డుకున్న జనసేన నాయకులు.#HelloAP_WelcomeJSP #HelloAndhra_ByeByeJagan pic.twitter.com/2AGNePj2Wq
ఎక్కడ సీఎం పర్యటన జరిగిన రోడ్ల వెంట చెట్లు ఉండకూడదన్నట్లుగా అధికారులు అతిగా భద్రతా ఏర్పాట్ల పేరుతో పర్యవరణానికి ఇబ్బంది కలిగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చివరికి డివైడర్ల మధ్య ఉన్న చెట్లను కూడా తొలగిస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.