Akhilesh Vs AP BJP : చంద్రబాబు అరెస్ట్‌కు బీజేపీకి లింక్ - అఖిలేష్ యాదవ్‌కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి !
చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కుట్ర అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఆయనకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Akhilesh Vs AP BJP : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నారు. యూపీ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ . చంద్రబాబు అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ట్రెండ్‌గా మారిందన్నారు. అధికారంలోకి రాని వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని.. ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ , వారి అవకాశవాద స్నేహితులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదంటూ చంద్రబాబును టాగ్ చేస్తూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
विपक्ष के नेताओं को गिरफ़्तार करने का चलन अब केंद्र से लेकर राज्यों तक प्रचलन बन गया है। जो सत्ता के साथ नहीं आ रहा है उसे जेल में डाल दो, ये निरंकुश शासकों की नीति होती थी, लोकतंत्र में इसके लिए कोई स्थान नहीं है।
— Akhilesh Yadav (@yadavakhilesh) September 12, 2023
भाजपाई और उनके अवसरवादी मित्र याद रखें कि राजनीतिक व्यवहार में…
అయితే చంద్రబాబు అరెస్టు బీజేపీ ప్రోద్భలంతో జరిగిందన్నట్లుగా ట్వీట్ ఉండటంతో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార పార్టీ కాదని ప్రతిపక్షంలో ఉందన్న సంగతి అఖిలేష్ యాదవ్ తెలుకోవాలని సూచించారు. అఖిలేష్ యాదవ్ అన్నట్లుగా నిజంగా బీజేపీ చేసి ఉండేదయితే.. ఇలా ట్వీట్ చేయగలిగే వారు కాదని ఉత్తరప్రదేశ్‌లోని ఏదో ఓ జైల్లో ఉండేవారని సైటైర్ వేశారు. మీరు అవినీతి పరులతోనే ఉంటున్నారా.. అయితే ఇదేమీ పెద్ద ఆశ్చర్యకర విషయం కాదన్నారు.
अखिलेश जी, आपको जानकारी होनी चाहिए की आंध्र प्रदेश में भाजपा की नहीं बल्कि YSR कांग्रेस की सरकार है और भाजपा विपक्ष में है।
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 12, 2023
अगर भाजपा वैसी होती जैसा आप बता रहे हैं तो आप इस तरह ट्वीट नहीं कर रहे होते बल्कि उत्तर प्रदेश के किसी जेल में होते।
वैसे क्या आप के भ्रष्टाचार के साथ… https://t.co/1BRVKtZyHQ
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుని కనీస ప్రొసీజర్ పాటించకుండా అరెస్ట్ చేశారని ఖండించారు. బీజేపీ కీలక నేత , రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా ఖండించారు. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం.. బీజేపీ ప్రోద్భలంతో అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం ..ఏపీ బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.
I.N.D.I.A ఇండియా కూటమి నేతలు చంద్రబాబుకు వరుసగా మద్దతు పలుకుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కూడా మద్దతు పలికారు. ఆయనది అక్రమ అరెస్ట్ అన్నారు.