అన్వేషించండి

Amarnath Vs Vishnu : ఏపీ అప్పులపై వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ బీజేపీ - అప్పుల లెక్కలన్నీ బయటపెట్టాలన్న విష్ణువర్ధన్ రెడ్డి !

ఏపీలో అప్పుల లెక్కలపై రాజకీయ వివాదం ప్రారంభమయింది. పురందేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు.

 

Amarnadh Vs Vishnu :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణల విషయంపై బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య  ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. పురందేశ్వరి చేసిన ఆరోపణలపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.  రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పు చేస్తోందని, తెచ్చిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 

అప్పులేమీ దుబారా చేయడం లేదన్న మంత్రి అమర్నాథ్ 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై దర్యాప్తు జరిపిస్తామని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజా ఒకపక్క ప్రజా సంక్షేమాన్ని, మరోపక్క రాష్ట్ర అభివృద్ధినిదృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుందని, దీనికి అవసరమైన మొత్తాన్ని నిబంధనలను మేరకు వివిధ రూపాల్లో సేకరిస్తుందని చెప్పారు. తాము ఎవరికీ చెప్పకుండా, చేసింది అప్పుకు లెక్క లేకుండా తెచ్చిన మొత్తాన్ని దుబారా చేయడం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. 

పురందేశ్వరి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారన్న అమర్నాథ్ 

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అప్పుకు లెక్క జమా లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిజెపి కూడా బాగాఆయనతో కలిసి ఉందని, అప్పుడు బిజెపిలో ఉన్న చిన్నమ్మ, బాబు చేసిన అప్పుల గురించి ఎందుకు అడగలేదని అమర్నాథ్ అమర్నాథ్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పైసాకి లెక్క చెబుతోందని అమర్నాథ్ అంటూ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదో మాట్లాడాలి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చిన్నమ్మ నిజాలు తెలుసుకుంటే మంచిదని అమర్నాథ్ హితవు పలికారు.

ప్రత్యారోపణలు కాదు సమాధానాలు చెప్పాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ 

మంత్రి గుడివాడ అమర్నాథ్‌  విమర్శకు ప్రతి విమర్శ సమాధానం కాదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు.   ఐదేళ్ల టిడిపి పాలనలో‌ 2,65,365 కోట్లు అప్పు చేశారు.   మీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో 7,14,631 కోట్లు అప్పు తెచ్చారు, ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చాలా డీటైల్డ్ గా ఏపీ ప్రభుత్వ అక్రమ అప్పుల గురించి వివరాలు మీడియా ముందు బయట పెట్టారన్నారు.  అ వివరాలు తప్పయితే ప్రభుత్వం వద్ద ఉన్న వివరాలు బయటపెట్టాలని..  మా పార్టీ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేదంటే బీజేపి చెప్పింది నిజమనే ఒప్పుకున్నట్లేనా ? అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ అర్థిక మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.   

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget