అన్వేషించండి

Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది

భారీ వర్షాల వల్ల తగ్గిన మొక్కజొన్న దిగుబడి. మొక్కజొన్నకు పెరిగిన డిమాండ్. మొక్కజొన్న క్వింటాకు రూ. 2,300 పలుకుతున్న ధర. కేవలం అంకాపూర్ మార్కెట్లోనే అందుబాటులో మొక్కజొన్న.

భారీ వర్షాల కారణంగా ఈసారి మొక్కజొన్న ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. వర్షాలకు మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల పంట రావాలి. కానీ ఈసారి 2 నుంచి మూడు క్వింటాళ్లే వచ్చింది. పంట చేతికి వచ్చే సమయంలో కంటిన్యూగా కురిసిన వర్షాలకు పంటదిగుబడి భారీగా తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్‌లో మొక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తారు. మొక్కజొన్న సాగులో ఆర్మూర్ డివిజన్ ఎప్పుడూ టాప్‌లొనే ఉంటుంది. ఏ సీజన్‌లో అయినా పండించేందుకు వెనుకాడరు ఇక్కడి రైతులు. ప్రధానంగా అంకాపూర్‌లో మక్క పంటను రైతులు ఎక్కువగా పండిస్తారు. ఈసారి జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. మొక్క జొన్న పంట వైపు రైతులు ఎక్కువ ఆసక్తి చూపలేదు. 25 వేల ఎకరాలు మించి సాగు కాలేదని వ్యవసాయ శాఖ లెక్కలు. మరోవైపు కొన్ని చోట్ల వర్షాలకు మక్క పంట బాగా దెబ్బతింది. అయితే అంకాపూర్‌లో ఈసారి మొక్కజొన్నకు భారీగా డిమాండ్ పెరిగింది. అంకాపూర్ పసుపు పంటతోపాటు మొక్కజొన్న పంటకు కూడా బాగా ఫెమస్.

భారీగా తగ్గిన దిగుబడి 

ఆర్మూర్ డివిజన్‌లో ఈసారి 8 వేల ఎకరాల్లో మాత్రమే మక్క దిగుబడి వచ్చింది. ప్రతి ఏటా ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల మొక్క జొన్న దిగుబడి వచ్చేది. ఈసారి కురిసిన భారీ వర్షాలకు దిగుబడి బాగా తగ్గి... ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో మక్కకు భారీగా డిమాండ్ పెరిగింది. గతేడాది క్వింటాకు ధర రూ.1400 పలికింది. ఈసారి క్వింటాకు రూ. 2,300 పలుకుతోంది. చిరు వ్యాపారుల వద్ద కాల్చిన ఒక్క మొక్క జొన్నను రూ. 15 నుంచి రూ.20కి విక్రయిస్తున్నారు.  

ప్రస్తుతం మక్కకు అంకాపూర్ మార్కెటే దిక్కు....

అంకాపూర్ మార్కెట్‌లో ప్రస్తుతం మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది. ఆర్ముర్ డివిజన్‌లో పండే మక్కను అంకాపూర్ మార్కెట్‌లొనే విక్రయిస్తారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి అలాగే చుట్టు పక్కల జిల్లాలకు మొక్కజొన్న ఎగుమతి అవుతుంది. మొక్కజొన్న కోసం ఆయా ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారులు అంకాపూర్ మార్కెట్ నుంచే కొనుక్కొని వెళతారు. ఈసారి మక్క దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ఉన్న ధర వల్ల మొక్కజొన్న పండించిన రైతులకు కాస్త ఊరట కలిగింది.

టాప్ హెడ్ లైన్స్

1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget