Tribal Dance in Medaram Jatara 2026 | మేడారంలో ఆదివాసీల డోలు విన్యాసాలు
ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క జాతరలో కోయ ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో సమ్మక్క సారక్క వన దేవతలను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లికి ఎదురుకోళ్లతో భక్తులు స్వాగతం పలికారు. గద్దెలపై వనదేవతలు కొలువుదీరడంతో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. వనదేవతల దర్శనానికి భక్తజనం లక్షలాదిగా తరలి వస్తున్నారు సమ్మక్క, సారక్క, గోవింద రాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ దేవతలకు కోయ ఆదివాసీలు పవిత్రంగా నిర్వహించే పూజలు ఏంటి..? సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కోయ ఆదివాసీలు చేసే సాంప్రదాయ వేషధారణ శివ సత్తుల పునకాలు, మరియు సాంప్రదాయ డోలు వాయిద్యాలు ఎలా వాయిస్తారు వీటి ప్రత్యేకత ఏమిటి..? ఎన్ని రోజులు సమ్మక్క సారక్క జాతరలో కోయ ఆదివాసీలు సాంప్రదాయ పూజలు నిర్వహిస్తూ కొలుస్తారు.. గతంలో సమ్మక్క సారక్క జాతర ఎలా ఉండేది..ప్రస్తుతం జాతర ఎలా కోనసాగుతోంది. ఈ అంశాలపై శివ సత్తుల పునకాలు వచ్చే కోయ ఆదివాసీలతో ABP దేశం ఫేస్ టు ఫేస్.
ట్రెండింగ్ వార్తలు






















