అన్వేషించండి
మేడారం అడవిలో వ్యర్థాలను తొలగించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
Mulugu MLA Seethakka పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు. మేడారం అడవిలో వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, శ్రీ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించిన తరువాత మేక, కోడి సహా ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ అడవిలో చెట్ల మీద కానీ గుడి ఆవరణలో పడేయకండని కోరారు. ఆ వ్యర్థాల వల్ల మీ తరువాత వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. జాతర తరువాత ఈ వ్యర్థాలతో చుట్టూ ప్రక్క గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా, కలరా వంటి విష జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందన్నారు. దగ్గరున్న చెత్త కుండీల్లో వ్యర్థాలను వేసి పరిశుభ్రతను పాటించాలని కోరారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















